Site icon NTV Telugu

Kcr New Jobs: తెలంగాణ భవన్‌లో అంబరాన్నంటిన సంబురాలు

తెలంగాణలో నిరుద్యోగులకు మంచి రోజులు రానున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సుమారు లక్ష ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఉద్యోగాల ప్రకటనకు హర్షం వ్యక్తం చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో సంబురాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యే దానం నాగేందర్ డ్యాన్స్ చేశారు.

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు మార్చి9 వ తేదీ అన్నారు దానం. నిరుద్యోగులను కాంగ్రెస్, బీజేపీలు ఉసిగొల్పాయి. సీఎం కేసీఆర్ పై అనవసర కామెంట్స్ చేసారు. బండి సంజయ్ నువ్వు ముందు మాటలు నేర్చుకోమన్నారు దానం నాగేందర్. జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి, ముఖ్య మంత్రిపై అనవసర కామెంట్స్ చేయడం సరికాదని హితవు పలికారు. ముఖ్యమంత్రికి పాదాభివందనం అన్నారు దానం.

కేంద్రంలో లక్షల సంఖ్యలో భర్తీ చేస్తామన్న ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఈరోజును సెలబ్రేట్ చేస్తాం అన్నారు. మరోవైపు ఓయూలోనూ విద్యార్ధులు సంబురాలు చేశారు. నిరుద్యోగ బంధు కేసీఆర్ అంటూ ఫ్లెక్సీలు. ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో పండుగ వాతావరణం నెలకొంది.

ఓయూలో సంబురాలు

Exit mobile version