Site icon NTV Telugu

KCR National Party: ముహూర్తం ఖరారు.. పార్టీ ప్రకటన ఆ రోజే

Kcr

Kcr

KCR National Party: సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. భారీ బహిరంగ సభ ద్వారా పార్టీ ప్రకటన చేయాలనుకున్న ఆయన ఎలాంటి హంగూ, ఆర్భాటాలు లేకుండా తెలంగాణ భవన్లో దసరా రోజు తన జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ఈ మేరకు అక్టోబర్ 5 మధ్యాహ్నం 1.19 నిమిషాలకు పార్టీ ప్రకటన చేయాలని ముహుర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం.

దేశం మొత్తం తెలిసే విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ అక్టోబర్ 5 న కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు సంబంధించిన హోర్డింగ్స్, ప్రధాన పత్రికల్లో యాడ్స్ ను టీఆర్ఎస్ బుక్ చేసినట్టు సమాచారం. అక్టోబర్ 5 న తెలంగాణ భవన్ లో ఉదయం 11 గంటలకు జాతీయ పార్టీపై టీఆర్ఎస్ ఏకగ్రీవ తీర్మానం చేయనుంది. మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యవర్గ తీర్మానం.. అనంతరం పార్టీ ప్రకటన చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదే సమావేశంలో జాతీయ పార్టీ కో ఆర్డినేటర్లను సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. రెండో వారంలో ఢిల్లీలో నిర్వహించే భారీ బహిరంగ సభకు అన్ని రాష్ట్రాల ముఖ్యనాయకులకు ఆహ్వానం అందనుంది. ఈ సభలోనే సీఎం కేసీఆర్ పార్టీ ఎజెండాను ప్రకటించనున్నారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకొనేందుకు టీఆర్ఎస్ సిద్ధమైనట్టు తెలుస్తోంది.
Rupee Effect on Foreign Education: రూపాయి విలువ పతనం.. భారతీయ విద్యార్థులకు భారం..

Exit mobile version