Kcr Master Plan: రాష్ట్రపతి ఎన్నికలు.. కేసీఆర్ మాస్టర్ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంతకాలం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై ధ్వజమెత్తుతోన్న సంగతి తెలిసిందే! అవకాశం దొరికినప్పుడల్లా ఆయన ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు వస్తోన్న తరుణంలో, ఆ పార్టీకి చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఆల్రెడీ కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమిని సిద్ధం చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే! బీజేపీయేతర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో పలుసార్లు సమావేశమయ్యారు.
ఇక జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు వస్తుండడంతో.. ప్రతిపక్ష కూటమి అభ్యర్థిని రంగంలోకి దింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. బీజేపీయేతర పార్టీల ఏకాభిప్రాయం సాధించి, ప్రతిపక్ష కూటమి తరఫున అభ్యర్థిని నిలబెట్టి, గెలిపించుకోవాలని ఆయన కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఏప్రిల్ నెలాఖరు నుంచి పలు రాష్ట్రాల్ని సందర్శించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ విషయంపై ఆయన తృణమూల్ కాంగ్రెస్, శివసేన, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, సీపీఎంలతో చర్చించనున్నారు.
Also Read
- Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే, బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకు 9,194 ఓట్లు తక్కువ ఉన్నాయి. జనతా దళ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇచ్చేందుకు ముందుకొస్తే.. బీజేపీ గెలుపుకు తిరుగులేదు. కానీ, బీజేపీకి మద్దతు తెలపొద్దని ప్రతిపక్ష కూటమి ఆ రెండు పార్టీల్ని ఒప్పించగలిగితే మాత్రం.. రాష్ర్టపతి ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి గెలిచే అవకాశం ఉంటుంది. లేకపోతే, కనీసం గట్టి పోటీ ఇచ్చినట్లైనా ఉంటుంది. మరి, కేసీఆర్ రచిస్తున్న వ్యూహం విజయవంతం అవుతుందా? లేదా? ఎన్నికల వరకూ వేచి చూడాల్సిందే! ఒకవేళ కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో బీజెపీకి చెక్ పెడితే మాత్రం.. 2024 లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమితో బీజేపీకి ముచ్చెమటలు పట్టించే అవకాశం వుంది.
ప్రస్తుతం బీజేపీ లేదా దాని కూటమి మొత్తం 17 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారంలో ఉంది. 776 పార్లమెంటేరియన్లు, 4,120 శాసనసభ్యులతో నిర్మితమైన కలెక్టొరల్ కాలేజ్ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. కలెక్టోరల్ కాలేజ్ లో మొత్తం 1,098,903 ఓట్లు ఉన్నాయి. 6,264 ఓట్లు కలిగిన జమ్ము & కాశ్మీర్ సస్పెండ్ అవ్వడంతో.. బీజేపీ మెజారిటీ 5,46,320 ఓట్లకి పడిపోయింది. బీజేపీ ఖాతాలో మొత్తం 4,65,797 ఓట్లు ఉండగా, దాని కూటమి 71,329 ఓట్లు కలిగి ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచేందుకు ఈ పార్టీకి మరో 9,194 ఓట్లు కావాలి.
తాజావార్తలు
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!