హైదరాబాద్ లోని కోకాపేట్ భూముల అమ్మకానికి కేసీఆర్ సర్కార్ అనుమతినిచ్చింది. కోకాపేట్ నియో పోలీస్ లోని భూముల వేలానికి హెచ్ ఎండీఏ కు అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. 239, 240 సర్వే నంబర్ల లోని భూమి పై హక్కులు పూర్తి గా ప్రభుత్వానివేనని నిర్ధారణ అయింది.
తెలంగాణ రాష్ట్రప్రభుత్వ ఏజెంట్ గా హెచ్ ఎండీఏ ఈ భూముల వేలం నిర్వహించనున్నది. వేలంలో.. భూములు కొన్న బిల్డర్లకు రిజిస్ట్రేషన్లు చేయాలని రంగారెడ్డి.. కలెక్టరెట్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐటీ కారిడార్ లోని కోకా పేట్ లో ప్రభుత్వ భూముల అమ్మకానికి ఈ ఏడాది జులై లో ఆన్ లైన్ లో నిర్వహించిన వేలం కార్యక్రమానికి రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి విపరీతమైన డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సారి కూడా ఈ భూములు భారీగా ధర పలుకనున్నాయి. ఈ భూముల వేలంతో ప్రభుత్వ ఖజనాకు సొమ్ము చేరనుంది.
