Pathipaka Mohan: కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారానికి పత్తిపాక మోహన్ ఎంపిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pathipaka Mohan: కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కారం-2022కు డాక్టర్ పత్తిపాక మోహన్ ఎంపికయ్యారు. ఈ ఏడాదిగాను 22 మంది రచయితలకు బాలసాహిత్య పురస్కారాలు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. పత్తిపాక మోహన్ రాసిన ‘బాలలతాత బాపూజీ’ గేయ కథకు ఈ పురస్కారం దక్కింది. నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సహాయ సంపాదకులు, కవి, సాహిత్య విమర్శకులు అయిన పత్తిపాక మోహన్ సిరిసిల్ల పట్టణంలోని చేనేత కుటుంబంలో జన్మించారు.
ఈ పురస్కారానికి డాక్టర్ పత్తిపాక మోహన్ ఎంపికవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఆయన రాసిన ‘బాలల తాత బాపూజీ’ గేయ కథకు ఈ పురస్కారం దక్కడం గొప్ప విషయమని సీఎం అన్నారు. గాంధీజీపై రాసిన బాల సాహిత్యానికి గాను తెలంగాణ సాహితీవేత్తకు ఈ అవార్డు దక్కడం, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భానికి మరింత శోభనిచ్చిందన్నారు. కీర్తి శేషులు డాక్టర్ సి. నారాయణరెడ్డి శిష్యుడైన, సిరిసిల్ల చేనేత కుటుంబానికి చెందిన, పత్తిపాక మోహన్.. సాహిత్య రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తెలంగాణ సాహితీ రంగానికి మరింత వన్నె తేవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
Also Read
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్‌బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
Hyderabad Old City: పాతబస్తీలో హై టెన్షన్.. రంగంలోకి ఆర్ఏఎఫ్ బలగాలు
బాలల్లో సాహిత్యంపై మక్కువ పెంచేందుకు పత్తిపాక మోహన్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లల కోసం మన కవులు, బాలలతాత బాపూజీ, జో.. అచ్యుతానంద జోజో ముకుంద, చందమామ రావే, ఒక్కేసి పువ్వేసి చందమామ వంటి అనేక రచనలు బాలల కోసం అందించారు. నేషనల్ బుక్ ట్రస్టు తెలుగు సహాయ సంపాదకులుగా వివిధ భాషల్లోని కథలు తెలుగులోకి అనువాదం చేశారు.
తాజావార్తలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్‌స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!