NTV Telugu Site icon

KCR: నేటితో ముగియనున్న కేసీఆర్ బస్సు యాత్ర.. సిద్దిపేటలో బహిరంగ సభ

Kcr

Kcr

KCR: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి రేపు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. దీంతో రాష్ట్రంలోని జాతీయ పార్టీల నేతలతో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ నేతలు వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రచారం చేయిస్తున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో స్టార్ ప్లానర్లతో ప్రచారం చేయిస్తున్నారు. ఇందులో భాగంగా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించారు. రోడ్ షోలో ఆయన ప్రజల కష్టాలు వింటూ ముందుకు సాగుతున్నారు. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర నేటితో ముగియనుంది.

Read also: PM Modi : ఫలించిన మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానం.. ఐదుగురు భారతీయ నావికులను విడుదల చేసిన ఇరాన్

ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు సిద్దిపేటలో బహిరంగ సభ జరగనుంది. సిద్దిపేట సభతో కేసీఆర్ బస్సుయాత్ర ముగియనుంది. ఏప్రిల్ 24న మిర్యాలగూడ నుంచి ప్రారంభమైన కేసీఆర్ ఎన్నికల ప్రచార బస్సుయాత్ర.. 16 రోజుల పాటు 13 లోక్ సభ నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లు నిర్వహించారు. ఎన్నికల సంఘం నిషేధంతో కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి 48 గంటల పాటు బ్రేక్ పడింది. మే 1వ తేదీ రాత్రి 8 గంటల నుంచి మే 3వ తేదీ రాత్రి 8 గంటల వరకు నిషేధం విధించిన ఈసీ.. నిషేధం ముగియడంతో కేసీఆర్ బస్సు యాత్ర యథావిధిగా కొనసాగనుంది.
Lok Sabha Elections 2024: పాలమూరు నియోజకవర్గంపై ప్రధాన పార్టీల ఫోకస్.. గంట తేడాతో సీఎం, పీఎం సభలు