NTV Telugu Site icon

KCR: నేడు వరంగల్‌ లో కేసీఆర్‌ బస్సుయాత్ర.. హనుమకొండ చౌరస్తాలో ప్రసంగం..

Kcr

Kcr

KCR: నేడు వరంగల్‌ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ బస్సుయాత్ర చేరుకోనుంది. హనుమకొండ చౌరస్తాలో మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు వరంగల్ నగరానికి వెళ్లనున్నారు. వరంగల్ లోక్ సభ అభ్యర్థి సుధీర్ కుమార్ తరపున హనుమకొండలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇవాల సాయంత్రం 4 గంటలకు నగరానికి కేసీఆర్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం జిల్లా నేతలతో కలిసి బస్సులో అదాలత్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, పెట్రోల్ పంపు జంక్షన్ మీదుగా హనుమకొండ చౌరస్తాకు చేరుకుని, అక్కడ ఏర్పాటు చేసిన సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించనున్నారు.

Read also: Human Trafficking : మదర్సాలకు తీసుకెళ్తామని చెప్పి 99మంది చిన్నారులను కూలీలుగా మార్చిన కేటుగాళ్లు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే.చంద్రశేఖర్ రావు రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర ఈనెల 24వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు కొనసాగనుంది. సుమారు 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. కేసీఆర్ బస్సు యాత్ర మిర్యాలగూడలో ప్రారంభమై సిద్దిపేటలో బహిరంగ సభతో ముగియనుంది. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభించారు. దాదాపు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం, ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు. తమ నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ బస్సుయాత్ర చేయాలని వివిధ నియోజకవర్గాల నేతల నుంచి ఆశాభావం వ్యక్తం చేయడంతో.. ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకుని పలు నియోజకవర్గాల్లో మాత్రమే బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించారు.
SRH vs CSK: సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరుకు చెన్నై సూపర్ కింగ్స్ బ్రేక్స్ వేయగలదా..?

Show comments