Site icon NTV Telugu

Shabbir Ali: కేసీఆర్ ఓటమిని అంగీకరించారు.. షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు

Shabbir Ali

Shabbir Ali

Shabbir Ali: కేసీఆర్ మీడియా ముందుకు రాకుండా ఓటమిని అంగీకరించారని కాంగ్రెస్ మాజీ మంత్రి షబ్బీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వారికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలన్నారు. ఎగ్జిట్ పోల్స్ లో రాష్ట్రంలో కాంగ్రెస్ కు మెజారిటీ వస్తుందని చెబుతున్నాయన్నారు. దొరల పాలన వద్దని ప్రజలు భావించి ఓటేశారని అన్నారు. బీఆర్ఎస్ ఆరిపోయే దీపం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ప్రజలు ఈసారి పట్టం కట్టారని తెలుస్తుందన్నారు. దీపం ఆరిపోయే ముందు వెలిగినట్టు ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అని కేటీఅర్ అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మీడియా ముందుకు రాకుండా ఓటమిని అంగీకరించారని కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాదు అర్బన్ లో మెజారిటీ కాంగ్రెస్ కు కనివినీ ఎరుగని రీతిలో వస్తుందని తెలిపారు. తనకు మెజారిటీ, మైనారిటీ అనే భావన లేదంటూ షబ్బీర్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈసారి షబ్బీర్ అలీ సొంత నియోజకవర్గం కామారెడ్డి నుంచి కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీ చేశారు. షబ్బీర్ అలీ కామారెడ్డికి బదులుగా నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేశారు.

Read also: CI Beat The Constable: ఇక్కడేం పని నీకు.. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‍పై సీఐ లాఠీఛార్జ్..

2018 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయంటూ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు వచ్చిన ఎగ్జిట్ పోల్ గతంలో కూడా చూశాం. మాకున్న అంచనా ప్రకారం 70 పైగా స్థానాల్లో మేమే గెలుస్తున్నాం. డిసెంబర్ 3న మీరే చూస్తారు, ఇప్పుడు వచ్చిన exit poll తప్పు అని.. మీరే తెలుసుకుంటారు. ఇదే నేషనల్ మీడియా గతంలోనూ ఇలాంటి ఫలితాలే ఇచ్చింది. కానీ మేమే అధికారం చేపట్టాం. ఇవాళ ఇచ్చిన exit poll పోల్ తప్పని.. ఇవాళ ఇచ్చిన ఫలితాలు నిజం కాదని.. డిసెంబర్ 3న తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తారా?. మళ్ళీ కేసిఆర్ సీఎం కాబోతున్నారు. ఫైనల్ పోలింగ్ శాతం అనేది రేపు ఉదయం వస్తుంది. ఆ తర్వత అనాలసిస్ చేయండి’ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Sreemukhi: ఆరంజ్ డ్రెస్సుతో ఆకట్టుకుంటున్న బుల్లితెర బ్యూటీ…శ్రీముఖి

Exit mobile version