MLC Kavitha: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మూడు రోజుల కస్టడీ నేటితో ముగిసింది. సీబీఐ అధికారులు ఆమెను ఇవాళ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. ఉదయం 10 గంటలకు జడ్జి కావేరీ బవేజా ఎదుట కవితను ప్రవేశపెడతారు. 3 రోజుల కస్టడీలో కవిత వెల్లడించిన పలు విషయాలను సీబీఐ కోర్టుకు చెప్పే అవకాశం ఉంది. కవిత విచారణకు సహకరించడం లేదని సీబీఐ భావిస్తే.. మరో 3-5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరే అవకాశం ఉంది. గతంలో ఈడీ కూడా కవితను రెండుసార్లు కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఇప్పుడు మళ్లీ సీబీఐ కస్టడీ తీసుకుంటుందా? లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. సీబీఐ కస్టడీకి కోర్టు అంగీకరిస్తే మళ్లీ కవితను సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలించే అవకాశం ఉంది.
Read also: Astrology: ఏప్రిల్ 15, సోమవారం దినఫలాలు
ఆదివారం విచారణలో భాగంగా.. ఆడిటర్ బుచ్చిబాబు ఫోన్ ద్వారా సేకరించిన చాటింగ్ లు, మహబూబ్ నగర్ లో భూ వ్యవహారం, ఆప్ నేతలకు ప్రాక్సీల ద్వారా డబ్బులు చెల్లించడం, ఈ క్రమంలో బెదిరింపులపై కవితను ప్రశ్నించినట్లు తెలిసింది. సీబీఐ కార్యాలయంలో ఉన్న కవితను ఆమె భర్త అనిల్, సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్, న్యాయవాది మోహిత్ రావు కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, కోర్టులో అనుసరించాల్సిన వైఖరి తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది, అయితే ప్రత్యేక కోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్‌పై ఈ నెల 16న విచారణ జరగనుంది. ఇటీవల సీబీఐ కూడా కవితను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
CSK vs MI: రోహిత్ సెంచరీ.. ముంబైకు తప్పని ఓటమి