Site icon NTV Telugu

Kavitha : ఏడాదిన్నరలో 150 మంది స్టూడెంట్స్ చనిపోయారు..!

Kavitha

Kavitha

Kavitha : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో సుసైడ్ చేసుకున్న విద్యార్థి వర్షిత కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్సీ కవిత పరామర్శించారరు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. శ్రీ వర్షిత సూసైడ్ వెనుక ఏదో కుట్ర ఉంది.. విచారణ చేపట్టాలని కవిత డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా.. వెల్ఫేర్ హాస్టల్‌లో పిట్టల్లా రాలుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆమె మండిపడ్డారు.

IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 5360mAh బ్యాటరీతో వచ్చేసిన Vivo X300 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్..!

ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందని, పిల్లలు చనిపోకుండా ఆలోచన చేయాలన్నారు. మంత్రి పొన్నం స్పందించాలి ఏమి జరుగుతుందో తెలియాలని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో చదువుతున్న 150 మంది స్టూడెంట్స్ ఏడాదిన్నరలో చనిపోయారని, ప్రభుత్వం ఇలానే ఉంటే న్యాయ పోరాటం చేస్తామని ఆమె వెల్లడించారు. స్టూడెంట్స్ ఆత్మహత్యల పై సిట్ వేసి విచారణ చేయాలని ఆమె అన్నారు. ప్రత్యర్థులు, ప్రతిపక్ష పార్టీల పై సిట్ వేయడం కాదని ఆమె విమర్శించారు.

Fatty Liver: డాకర్ట్ చెప్పిన రహస్యం..! ఫ్యాటీ లివర్ నయం కావాలంటే ఈ చిట్కాలు పాటించండి..

Exit mobile version