Site icon NTV Telugu

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురు.. బెయిల్ నిరాకరించిన కోర్టు

Mlc Kaivtha Rose Evenu Court

Mlc Kaivtha Rose Evenu Court

MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు బెయిల్‌ నిరాకరించింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు ఈ విధంగా తీర్పు వెలువరించింది. కవిత కు వ్యతిరేకంగా ఈడి, సిబిఐ కేసులు ఉండటంతో.. రెండు కేసుల్లో కవిత కు బెయుల్ నిరాకరించింది కోర్టు. రెండు కేసుల్లో కవిత దాఖలు చేసిన వేసిన పిటీషన్లను న్యాయమూర్తి కావేరీ బవేజా డిస్మిస్ చేశారు. కవిత ప్రస్తుతం తిహాద్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. కవిత దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ, సీబీఐ కోర్టుకు తెలిపాయి. స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చిందని కవిత కోర్టుకు తెలిపారు. మహిళగా తనకు పీఎంఎల్‌ఏ సెక్షన్ 45 కింద బెయిల్‌కు అర్హత ఉందని కవిత కోర్టుకు తెలిపారు.

Read also: Petrol Price : ఒక నెలలో 10శాతం పడిపోయిన క్రూడాయిల్ ధర.. మరి పెట్రోల్ ధరల పరిస్థితి

రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లు మరోసారి తిరస్కరణకు గురయ్యాయి. అయితే తాజాగా కవిత మాట్లాడుతూ.. నేను అప్రూవర్‌ గా మారేది లేదని, కడిగిన ముత్యంలా బయటికి వస్తానని అన్న విషయం తెలిసిందే. ఇది మనీలాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అన్నారు. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు కానీ.. ఒక నిందితుడు ఆల్రెడీ బిజెపిలో చేరాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకో నిందితుడు బీజేపీ టికెట్ ఇచ్చిందని అన్నారు. మూడో నిందితుడు రూ.50 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడని తెలిపారు. క్లీన్ గా బయటకు వస్తా.. అప్రూవ్ వర్ గా మారేది లేదని క్లారిటీ ఇచ్చారు. మరి రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.

The Goat Life OTT : ఓటీటీలోకి రాబోతున్న సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Exit mobile version