NTV Telugu Site icon

Minister KTR: కేటీఆర్‌తో కసిరెడ్డి, జైపాల్ భేటీ.. ఆసక్తికరంగా మారిన సమావేశం..!

Ktr Kasireddy

Ktr Kasireddy

Minister KTR: పాలమూరు రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడతారని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కేటీఆర్‌తో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ భేటీ అయ్యారు. కసిరెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో కేటీఆర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జైపాల్ యాదవ్, కసిరెడ్డి నారాయణ రెడ్డిల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌కు మళ్లీ టిక్కెట్‌ కేటాయించింది. కసిరెడ్డి కూడా పార్టీ నుంచి కల్వకుర్తి టికెట్ ఆశించారు.

కసిరెడ్డి కాంగ్రెస్‌లో చేరి కల్వకుర్తి నుంచి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేటీఆర్ ను జైపాల్ యాదవ్ తో కలిసి కసిరెడ్డి కలిశారు. ఇరువురు నేతల మధ్య విభేదాలను ప్రస్తావించినట్లు సమాచారం. వారిద్దరి గురించి ముఖ్యమంత్రితో మాట్లాడతానని, ఎవరూ తొందరపడవద్దని కేటీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. కేటీఆర్‌ను విడివిడిగా కలిశామని ఎమ్మెల్సీ కసిరెడ్డి చెబుతుండగా, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాత్రం ఇద్దరూ కలిసి కేటీఆర్‌ను కలిశారని, సమస్య పరిష్కారమైందని అంటున్నారు. కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్‌తో చాలా రోజులుగా విభేదాలు ఉన్నాయి. 2018లోనే కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నారాయణరెడ్డి ప్రయత్నించారు. జైపాల్ యాదవ్ కు బీఆర్ ఎస్ టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీగా కొనసాగించారు. 2021లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణరెడ్డికి అవకాశం కల్పించిన బీఆర్ఎస్.. ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నా.. ఆయనకు అవకాశం దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు టికెట్ కేటాయించారు. అప్పటి నుంచి కసిరెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని భావిస్తున్న తరుణంలో కేటీఆర్ ను కలవడం ఆసక్తికరంగా మారింది. కసిరెడ్డి చేరికకు బ్రేక్ పడిందా అనే చర్చ సాగుతోంది.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకర్తి నుంచి బీఆర్ ఎస్ టికెట్ ఆశించిన కసిరెడ్డికి నిరాశే ఎదురైంది. ఆ సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు కేసీఆర్ కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. పైగా ఆయనకు కల్వకుర్తి టిక్కెట్టును కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసిందని ప్రచారం జరుగుతోంది. నిన్న హైదరాబాద్ లోని తన నివాసంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలతో ఆయన భేటీ కావడం ఈ వార్తలకు ఊతం ఇస్తోంది.
Atrocious: ఇంత దారుణమా.. ఏడేండ్ల చిన్నారిపై అత్యాచారం చేసి గొంతుకోసి హత్య