NTV Telugu Site icon

Rangareddy Crime: షాద్‌ నగర్‌ లో కిడ్నాప్‌.. గచ్చిబౌలిలో హత్య

Karunaker Reddy

Karunaker Reddy

Karunakar Reddy, who was kidnapped in Kothur, was brutally murdered: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ లో కిడ్నాప్ కు గురైన కరుణాకర్ రెడ్డి కథ విషాదాంతంగా ముంగిసింది. ఇవాళ ఆయన దారుణ హత్యకు గురయ్యాడు. చేగూర్ సమీపంలో కరుణాకర్ రెడ్డి కారును అడ్డగించి అద్దాలు పగలగొట్టి అతని పై దాడి చేశారు. అడ్డగించిన వ్యక్తి పై దాడి చేసి కరుణాకర్ రెడ్డి కిడ్నాప్ చేశారు. సిక్రేట్ ప్లేస్ కు తీసుకొని వెళ్లిన దుండగులు. కరుణాకర్ ను విచక్షణారహితంగా దుండగులు చితకబాదారు. ముఖంపై పిడు గుద్దులు గుద్ది రెండు చేతులు, కాళ్లు దుండగులు విరగగొట్టారు. దీంతో కరుణాకర్ రెడ్డి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. కరుణాకర్‌ రెడ్డి కదలకపోవడంతో దుండగులు నిన్న రాత్రి గచ్చిబౌలి కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు.

కరుణాకర్ రెడ్డిని పరీక్షించిన వైద్యులు కరుణాకర్‌ రెడ్డి అప్పటికే మృతి చెందాడని చెప్పడంతో ఆసుపత్రి నుండి దుండగులు పరారయ్యారు. కరుణాకర్‌ రెడ్డిని తీసుకుని ఐదు మంది ఆసుపత్రికి వచ్చి‌నట్లు సమాచారం. ఆసుప్రతి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన అక్కడకు చేరుకున్నారు. మృతి చెందిన వ్యక్తి కరుణాకర్ రెడ్డిగా గుర్తించారు. కరుణాకర్‌ రెడ్డి మృతదేహం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈవిషయమై కరుణాకర్ రెడ్డి కుటుంబానికి తెలియజేశారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు కరుణాకర్ రెడ్డి స్వస్థలం మల్లాపూర్ గ్రామంలో భారీగా పోలీసుల మోహరించారు.

Read also: KTR Twitter: ట్విటర్‌ లో కేటీఆర్‌ను ప్రశ్నించిన నెటిజన్‌.. స్మూత్‌ గా బదులిచ్చిన మంత్రి

కరుణాకర్‌ రెడ్డి చనిపోయిన వార్త వినగానే కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి. నిన్న కిడ్నాప్‌ గురయ్యారని ఫిర్యాదు చేసామని ఇవాల కరుణాకర్‌ రెడ్డి చనిపోయాడని పోలీసులు ఫోన్‌ చేశారని కన్నీరుమున్నీరయ్యారు. కొత్తూరు ఎంపీపీ మధుసూదన్ రెడ్డి బామ్మర్దులు పాత కక్షలు నేపథ్యంలో కిడ్నాప్ చేసినట్లు కిడ్నాప్‌ చేసి కరుణాకర్ రెడ్డి ని చంపేసారని తల్లి స్వరూప వాపోయింది. తనకు న్యాయం చేయాలని కరుణాకర్‌ రెడ్డిని చంపిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

ఓ భూమి విషయంలో గ్రామ పెద్ద మద్య పంచాయితీ కొనసాగుతుంది. కరుణాకర్ రెడ్డికి అనుకూలంగా తీర్పు రావడంతో MPP మదుసూదన్ రెడ్డి జీర్ణించుకోలేక పోయాడు. పంచాయతి అయిపోయి నప్పటి నుండి 15 మంది తో మదుసూదన్ రెడ్డి మనుషులు రెక్కీ నిర్వహించారు. చివరికి చేగూర్ సమీపంలో అటాక్ చేసి, కారులో కిడ్నాప్ చేశారు. కరుణాకర్‌ రెడ్డి చచ్చిపోయేంత వరకు కొట్టి ఏమీ తెలియనట్లు ఆసుపత్రికి తీసుకుని వచ్చిన చనిపోయాడని తెలియగానే అక్కడి నుంచి పరార్‌ అయ్యారు.

Show comments