NTV Telugu Site icon

Kartika Purnima: తెలుగు రాష్ట్రాలకు కార్తీక పౌర్ణమి శోభ.. శివనామ స్మరణతో మారుమోగుతున్న ఆలయాలు..

Kartika Purnima

Kartika Purnima

Kartika Purnima: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి శోభను సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని శివాలయాల్లో ఉదయం నుంచే భారీగా భక్తుల రద్దీ నెలకొంది. ఆలయాల్లో శివనామస్మరణ మారుమోగుతున్నాయి. ప్రత్యేక అభిషేకం, పూజలతో తమ కోరికను కొలుస్తున్నారు. కార్తీక పూర్ణిమ నాడు నదులలో స్నానం చేసి కార్తీక దీపారాధన చేస్తారు. కార్తీక పూర్ణిమ సందర్భంగా శ్రీశైలం, ద్రాక్షారామం, వేములవాడ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని వరంగల్, అన్నవరం, ద్వారకాతిరుమలలోని భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీరంగూడలోని ప్రముఖ దేవాలయం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో కూడా భక్తులు కార్తీక పూర్ణిమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ఇక్కడ మల్లికార్జున స్వామికి సంప్రోక్షణ నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో కూడా కార్తీక మాసంలో ఆలయాలన్నీ కళకళలాడాయి. హనుమకొండ రుద్రేశ్వర స్వామి సిద్ధేశ్వర స్వామి ఆలయం, కాళేశ్వరం, రామప్ప, పాలకుర్తి సోమేశ్వర స్వామి ఆలయం, కురవి వీరభద్ర స్వామి, అయినవోలు మల్లికార్జున స్వామి ఆలయాల్లో ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లలో నిల్చుని దీపపూజలు చేస్తున్నారు.

Read also: Raghunandan Rao: 171 ఓట్లతో గెలిచిన కేటీఆర్.. 1700 ఓట్లతో గెలిచిన నన్ను ఎక్కిరిస్తుండు

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం, భద్రాచలంలోని గోదావరి, విజయవాడలోని కృష్ణా నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. సోమవారం కార్తీక పూర్ణిమ కావడంతో అన్నవరం సత్యనారాయణ సన్నిధిలో ఉపవాస దీక్షలు చేసేందుకు భక్తుల్లో పోటీ నెలకొంది. పిఠాపురం పాదగయ ప్రాంతంలోని శ్రీ ఉమా కుక్కటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇక్కడ పాదగయ పుష్కరిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి ఘాట్లలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. రాజమండ్రిలోని మార్కండేయ స్వామి ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు పంచారామ ప్రాంతంలోని ద్రాక్షారామం, కోటిపల్లి మురుమళ్ల ముక్తీశ్వరుడు క్షణముక్తేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
Bhatti Vikramarka: నోటిఫికేషన్ వస్తే.. రైతు బంధు ఇవ్వడం కుదరదని కేసీఆర్ కు తెలుసు