Site icon NTV Telugu

Minister KTR: క‌ర్ణాట‌క ఫ‌లితాలు తెలంగాణ‌పై ఎటువంటి ప్రభావం చూప‌లేవు

Ktr

Ktr

Minister KTR: కర్ణాటక ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. నీచమైన, ద్వేషపూరిత రాజకీయాలను కర్ణాటక ప్రజలు తిరస్కరించారు. కేరళ స్టోరీ సినిమా కర్ణాటక ప్రజలను మెప్పించడంలో విఫలమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న కాంగ్రెస్ పార్టీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కేరళ స్టోరీ సినిమా కర్ణాటక ప్రజలను ఆకర్షించడంలో విఫలమైందని, కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపబోవని మంత్రి కేటీఆర్ అన్నారు. నీచమైన, విద్వేషపూరిత రాజకీయాలను తిరస్కరించినందుకు కర్ణాటక ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడంలో, మౌలిక వసతుల కల్పనలో, దేశ భవిష్యత్తు కోసం హైదరాబాద్, బెంగళూరు నగరాలు ఆరోగ్యకరమైన పోటీని నెలకొల్పాలని మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో ఆకాంక్షించారు.

కన్నడ రాజకీయాలు మలుపు తీసుకున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ను తిరగరాస్తూ.. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి రానుంది. కర్ణాటక ప్రజలు మోడీని ఓడించి, జేడీఎస్‌కి మద్దతు పలికిన కేసీఆర్ ని ఓడించారని, హాంగ్ రావాలని కేసీఆర్ చూశారన్నార టీ కాంగ్రెస్‌ నేతలు అన్నారు. మోడీని, కేసీఆర్ ఆలోచన కర్ణాటక ప్రజలు తిరస్కరించారని.. అదే ప్రభావం తెలంగాణ ఎన్నికలపై చూపుతాయన్నారు. కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారని ఎక్కడ ప్రజల తీర్పుని స్వాగతించలేదని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకొచ్చారు. మోడీ ఓడిపోతే కేటీఆర్‌ ఎందుకు బాధ పడుతున్నారని ప్రశ్నించారు. మహారాష్ట్ర లో సభలు పెట్టె కేసీఆర్..కర్ణాటక లో ఎందుకు పెట్టలేదు. మోడీ ని ఓడించండి అని ఎందుకు పిలుపు ఇవ్వలేదు. తెలంగాణలో కూడా గెలిచేది కాంగ్రెస్‌ పార్టీనే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు.
Karnataka Results: కర్ణాటకలో సెంటిమెంట్ రిపీట్.. ఏ పార్టీ రెండో సారి గెలవలేదు

Exit mobile version