NTV Telugu Site icon

Kaushik Reddy: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు..

Kaushik Reddy

Kaushik Reddy

Kaushik Reddy: బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దళితుల బంధు రెండో విడత డబ్బులు విడుదల చేయాలని కౌశిక్ రెడ్డి ఈ నెల 9న హుజూరాబాద్ లో ధర్నా, నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే కౌశిక్ రెడ్డి ధర్నాకు, నిరసనకు ఎలాంటి అనుమతి తీసుకోకపోవడం వివాదాస్పదమైంది. అనుమతి లేకుండా ధర్నా, నిరసనలు చేపట్టినందుకు గాను ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేతలపై బీఎన్‌ఎస్‌ చట్టంలోని సెక్షన్‌ 35(3) కింద పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముందుంటున్నారు. బొగ్గు బూడిద రవాణాలో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనా విధానాలను కూడా అసెంబ్లీ లోపల, బయట, మీడియా సమావేశాల్లో విపక్షాలు తరచూ విమర్శిస్తున్నాయి. ఎమ్మెల్యే ఫిరాయింపు వివాదంలో కౌశిక్ రెడ్డి స్వయంగా అరికపూడి గాంధీకి సవాళ్ల వివాదం సాగింది. కోర్టులో పిటిషన్ కూడా వేశారు.
Karthika Masam: తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు..

Show comments