Site icon NTV Telugu

హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ విజయాన్ని ఆపలేరు…

హుజూరాబాద్‌ మండల ప్రజాప్రతినిధులు, నేతలు, ఇంచార్జులకు మంత్రి హరీశ్‌రావు దిశానిర్ధేశం చేశారు. తాజాగా అక్కడి నేతలతో హరీశ్‌రావు మాట్లాడుతూ… వెక్కిరించిన పనులే వెలుగునిస్తున్నాయి. ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మీ, రైతుబంధు, కాళేశ్వరం తరహాలోనే దళితబంధు అమలుకూడా జరుగుతుంది అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల్లేవు. ఉద్యోగాలు ఊడగొట్టడమే ఆ పార్టీకి తెలుసు. 1.32లక్షల ఉద్యోగాలు కల్పించిన పార్టీ టీఆర్‌ఎస్‌. బీజేపీ దొంగ నాటకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ విజయాన్ని ఆపలేరు అని తెలిపారు. భారీ మెజార్టీతో సీఎం కేసీఆర్‌కు విజయాన్ని బహుమతిగా ఇవ్వాలి అని పేర్కొన్నారు.

Exit mobile version