Telangana Panchayat Elections 2025: సర్పంచ్ ఎన్నికల కోసమే పెళ్లి.. ఆ నేత ప్లాన్ రివర్స్..!
- సర్పంచ్ కావాలన్నదే తన కల..
- పెళ్లి కూడా వాయిదా వేస్తూ లోకల్ లీడర్ శంకర్..
- ఎస్సీ మహిళా రిజర్వేషన్ రావడంతో వెంటనే పెళ్లి..
- ఓటర్ జాబితాలో తన భార్య పేరు నమోదు కాక పోవడంతో షాక్..
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్‌లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Panchayat Elections 2025: అనుకున్నదొక్కటి… అయింది ఒక్కటీ… అన్నట్టుగా మారిందట ఆ వ్యక్తి పరిస్థితి… గ్రామానికి సర్పంచ్ కావాలన్నది అతడి కల.. ఇన్నాళ్లుగా అతనికి వివిధ కారణాలతో ఆ పదవి దక్కలేదు.. ఈసారి ఆ గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించడంతో.. ఇంతకాలం పెళ్లి చేసుకొని ఆ సీనియర్ బ్యాచిలర్ ఉన్నపళంగా నిశ్ఛితార్థం చేసుకుని పెళ్లి చేసుకున్నాడు. మహిళా రిజర్వేషన్ కావడంతో పెళ్లి చేసుకుంటే తన భార్యకు అయినా పదవి దక్కుతుందని ఆయన వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది.. అతని కల నెరవేరకపోయినా… ఓ ఇంటి వాడైతే అయ్యాడు… లోకల్ ఫైట్ లోని పదనిసల్లో.. ఆ నాయకుడికి రివర్స్ ఎందుకు అయింది? అసలేం జరిగింది..? ఎక్కడ జరిగింది ఈ సిత్రం…? పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Also Read
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ పంచాయితీ ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా సర్పంచ్ పీఠం దక్కించుకోవాలన్నది ముచ్చె శంకర్ అనే నాయకుడి చిరకాల కోరిక…. నాయకుడిగా నిలదొక్కుకున్నకే పెళ్లి అని వివాహాన్ని వాయిదా వేసేసాడు శంకర్.. ఈ తరుణంలోనే వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో నాగిరెడ్డిపూర్ పంచాయితీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వేషన్ అయింది… కానీ, అప్పటికి తాను అవివాహితుడు. దాంతో తనకు పీఠం దక్కే అవకాశం లేకపోవడంతో… బాగా ఆలోచన చేసిన శంకర్.. స్థానిక సమరం నేపథ్యంలో వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేసుకుని ఓ అమ్మాయిని చూసి వివాహమాడాడు. ఆమెను నాగిరెడ్డిపూర్ ఓటర్ గా చేర్చి… సర్పంచ్ పీఠంపై తను కాకుంటే.. తన భార్యను కూర్చోబెట్టి చక్రం తిప్పాలనుకున్నాడు. కానీ, తాననుకున్న సమయం కంటే ముందే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. దాంతో బుధవారం హడావిడిగా ఓ గుళ్లో పెళ్లి చేసుకున్నాడు. కానీ, అప్పటికే ఓటర్ జాబితాలో దరఖాస్తు చేసుకోవడానికి ఆలస్యమైపోయింది. దాంతో ఓటర్ జాబితాలో తన భార్య పేరు నమోదు కాలేదు. సర్పంచ్ ఎన్నిక కోసం తొందరపడి పెళ్లి చేసుకుంటే… అసలు అసలు లక్ష్యం నెరవేరకపోవడంతో నారాజ్ అవుతున్నాడు శంకర్. కానీ, ఏదైతేనేం… సర్పంచ్ కాకపోయినా పర్లేదు.. ఓ ఇంటివాడివయ్యావుగా అంటూ చుట్టుపక్కలవారు దీవించారు…. పెళ్లి అయినందుకు బంధువులు సంబరపడుతుండగా… అందివచ్చిన ఛాన్స్ దక్కకపోవడంతో కక్కలేక మింగలేక పోతున్నాడట శంకర్..
తాజావార్తలు
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!