Site icon NTV Telugu

ఈటల కొడుకు భూ కబ్జా చేసారని సీఎంకు ఫిర్యాదు…

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారాల్లో సీఎం కేసీఆర్ కు మరో ఫిర్యాదు అందింది. ఈటల కొడుకు నితిన్ రెడ్డి భూ కబ్జా చేసారని సీఎంకు ఫిర్యాదు చేసారు మేడ్చల్ జిల్లా రావల్ కోల్ కు చెందిన మహేష్ ముదిరాజ్ అనే వ్యక్తి. అయితే ఈ ఫిర్యాదు పై విచారణ ప్రారంభించాలని సీఎస్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు. ఏసీబీ, విజిలెన్స్, రెవెన్యూ శాఖలతో విచారణ జరపాలి తెలిపారు. సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అయితే చూడాలి మరి ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది.

Exit mobile version