NTV Telugu Site icon

Karimnagar: అనుమానాస్పద మృతిని చేధించిన జమ్మికుంట పోలీసులు..

Police

Police

Karimnagar: అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చును రేపుతున్నాయి. చివరకు ఆత్మహత్యలు, హత్యలకు కారణం అవుతున్నాయి. పెళ్లై పిల్లలు ఉన్న వారు పిల్లల జీవితాన్ని, తమ గౌరవాన్ని పట్టించుకోకుండా బరితెగిస్తున్నారు. భర్తలను కాదని ప్రియులతో సంబంధాలు నెరుపుతూ కొంతమంది భార్యలు హత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అనేకం జరిగాయి. చాలా సందర్భాల్లో అక్రమ సంబంధాలు హత్యలకు కారణం అవుతున్నాయి.

Read Also: RCB vs PBKS : ఆర్సీబీ ఘన విజయం.. 150 పరుగులకే పంజాబ్ ఆలౌట్

తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట నాలుగు నెలల క్రితం జరిగిన హత్యను చేధించారు పోలీసులు. కొన్ని రోజుల క్రితం పోలోజు రమేష్(38) అనే వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు జమ్మికుంట మండలం మడిపల్లి-ఉప్పల్ రైల్వే ట్రాక్ పై గుర్తించారు. దీన్ని అనుమానాస్పద మృతిగా పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. కొడుకు మృతిపై అనుమానం వ్యక్తం చేసిన తల్లి కవిత రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారణ నిమిత్తం రైల్వే పోలీసులు, సివిల్ పోలీసులకు బదిలీ చేశారు.

కేసు విచారణలో రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి సెల్ ఫోన్, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ప్రారంబించారు. అక్రమ సంబంధమే హత్యకు దారి తీసినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు పాల్పడిన కంచం రజిత, భర్త రమేష్, కంచం ఓదెలు, రుద్రవేన దేవేందర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.