Site icon NTV Telugu

రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో భారీ అగ్నిప్రమాదం

పెద్దపల్లి జిల్లా రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లోని టాటా కంపెనీకి చెందిన స్టోర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నూతనంగా నిర్మాణంలో ఉన్న సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ లోని టాటా ఎలక్ట్రానిక్ ప్రాజెక్టులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్ షెడ్ డౌన్ కావడంతో ఉదయం నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా కరెంట్ సప్లై కావడంతో టాటా స్టోర్స్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎలక్ట్రానిక్ వస్తువులు పెద్ద ఎత్తున దగ్ధం అయినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 4 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనలో సుమారు కోటి రూపాయల మేర నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Exit mobile version