Karimnagar: కోతుల బెడదకు రైతు ఇన్నోవేటివ్ ఐడియా.. పంటను కాపాడిన ప్రత్యేక పరికరం!
- వినూత్న పరికరంతో కోతుల బెడదకు చెక్..
- ఏనుగు అరుపులు వినిపించే పరికరంతో పంట కాపాడుకున్న రైతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karimnagar: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎలాబోతారం గ్రామానికి చెందిన రైతు మేకల మహిపాల్ రెడ్డి తనకు ఉన్న రెండు ఎకరాల భూమిలో మొక్కజొన్న పంటను సాగు చేస్తున్నాడు. అయితే, పంట పొలంలోకి తరచుగా కోతులు చొరబడి పంటను నాశనం చేయడం ప్రారంభించాయి. దీంతో కోతుల బెడదను తగ్గించుకోవాలని ఆ రైతు తీవ్రంగా ఆలోచించాడు. ఈ క్రమంలోనే హుజురాబాద్‌లోని ఒక ఎలక్ట్రికల్ షాపులో పెద్ద శబ్ధం వినిపించే ప్రత్యేక పరికరాన్ని కొనుగోలు చేశాడు. దానిని పంట పొలం పక్కన అమర్చి కోతుల బెడదను నియంత్రించగలిగాడు. ఈ పరికరం ద్వారా జంతువులు పంట పొలం దరిచేరకుండా కాపాడుకోవడం సాధ్యం అవుతుందని రైతు మహిపాల్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Sexual harassment : మైనర్ విద్యార్థినిపై హాస్టల్ యజమాని లైంగిక వేధింపులు!
Also Read
ఇక, రైతు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ పరికరంలో పలు రకాల శబ్ధాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.. దీన్ని బ్లూటూత్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చని చెప్పుకొచ్చాడు. యూ అండ్ ఐ అనే కంపెనీ తయారు చేసిన ఈ పరికరంతో చాలా వరకు కోతులు, ఇతర జంతువులు పంటకు దగ్గర కావడం లేదన్నాడు. ప్రస్తుతం ఈ పరికరంలో ఏనుగు అరుపులను రికార్డు చేసి ఉంచాను.. ఆ సౌండ్స్ వినిపించడంతో పంట పొలం చుట్టుపక్కల ప్రాంతాలకు జంతువులు రావడానికి భయపడుతున్నాయని తెలిపాడు. దీంతో తన పంటను సురక్షితంగా కాపాడుకుంటున్నానని ఆ రైతు ఆనందం వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Nagarjuna: నా ట్రాక్ రికార్డ్ చూడండి ఫ్లాప్ అయితే కాలేదు.. సినిమా ప్రెజెంటేషన్‌పై నాగార్జున బోల్డ్ కామెంట్స్!
-
Divija: తమిళ్ సినిమాలో హీరోయిన్ గా ఈటీవీ ప్రభాకర్ కూతురు
-
Under -19 Asia Cup: టెయిలెండర్ల అద్భుతం.. పాకిస్థాన్‌ను చిత్తు చేసి ఆసియా కప్ కొట్టేసిన భారత్..
-
Rahul Gandhi : ఫాసిస్టు శక్తులను తరిమికొడతాం.. హైదరాబాద్ వేదికగా రాహుల్ గాంధీ పిలుపు
-
#AA23 బిజినెస్ లెక్కలు.. వైరల్ అవుతున్న బన్నీ, లోకేష్, మైత్రీ డీల్?
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!