దళిత బంధు అందరికీ అందించక పోతే ఉద్యమం తప్పదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. దళిత బంధు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో నున్న ప్రతి దళిత కుటుంబానికి కూడా దళిత బంధు వెంటనే అందించాలని కోరారు. 10 లక్షల రూపాయలు దళితులు వారి నైపుణ్యానికి అనుగుణంగా ఖర్చు పెట్టుకొనే వెసులుబాటు కల్పించాలన్నారు. వాటి మీద కలెక్టర్, బ్యాంక్ మేనేజర్ ల అజమాయిషీ తీసివేయాలన్నారు. అందరికీ అందించకుండా చాటలో తవుడు పోసి కొట్లాట పెట్టినట్టు చేస్తే నేనే దీక్షకు కూర్చుంటానని ఈటల రాజేందర్ హెచ్చరిస్తున్నారు.
దళిత బంధు అందరికీ అందించకపోతే ఉద్యమం తప్పదు
