Dengue Fever: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జ్వర పీడితులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో విష జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కరీంనగర్ జిల్లాలోనూ డెంగ్యూ జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ప్రతిరోజూ వందలాది మంది విష జ్వరాల బారిన పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 110 డెంగీ కేసులు నమోదవుతున్నాయి. లింగంపేట మండలం మెంగారంలో అన్నం రాజు అనే వ్యక్తి డెంగ్యూతో మృతి చెందాడు. లింగం పేట సదాశివ నగర్ మండలాల్లో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగింది. దీంతో ప్రజలు భయంతో రోజులు గడుపుతున్నారు.
Read also: CM Biren Singh: “రాజీనామా ప్రసక్తే లేదు.. వచ్చే ఆరు నెలల్లో మణిపూర్ లో శాంతి ఖాయం!”
ఇక నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ కూడా వైరల్, డెంగ్యూ రోగులతో నిండిపోయింది. గతంలో 500 నుంచి 800 వరకు ఉన్న రోజువారీ ఓపీ ప్రస్తుతం వెయ్యి దాటుతుందంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. అధికారిక గణాంకాల ప్రకారం జూలై, ఆగస్టు నెలల్లో ఇప్పటివరకు 714 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇక మరోవైపు ఆసుపత్రుల్లో పడకలు ఖాళీగా లేవు’… ఇది సర్కార్ దవాఖాన సిబ్బంది చెబుతున్న మాట కాదు.. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఇదే మాట వినిపిస్తోంది. సీజనల్ జ్వరాలతో ప్రభుత్వ ఆస్పత్రులే కాకుండా ప్రైవేట్ ఆస్పత్రులు కూడా రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రతి ఇంట్లో జ్వరపీడితులు, డెంగ్యూ బాధితులు ఉండడంతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రైవేట్‌లో కూడా పడకలు అందుబాటులో లేవు. దీంతో మళ్లీ కరోనా పరిస్థితి గుర్తుకు వస్తోంది. ఎక్కువగా వైరల్ ఫీవర్, డెంగ్యూ కేసులు వస్తున్నాయని ప్రైవేట్ దవాఖానల వైద్యులు చెబుతున్నారు.
17 Years of NTV Journey: ప్రతిక్షణం ప్రజాహితం.. ఎన్టీవీ 17 ఏళ్ల ప్రయాణం..