NTV Telugu Site icon

హుజూరాబాద్‌లో గంజాయి ఇచ్చి ఓట్లడుగుతున్నారు..చాడ

హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. దీంతో రాజకీయ పార్టీల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. హుజూరాబాద్‌లో కొత్తగా గంజాయి ఇచ్చి ఓట్లు అడుగుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. దేశ భవిషత్తును పాడుచేసే విధంగా మోడీ పాలన సాగుతోందని, ప్రభుత్వ రంగాలను తక్కువకే ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని చాడ మండిపడ్డారు. రైతులను బజారు పాలు చేసే చట్టాలు తెచ్చారు, మోడీ పాలనలో రైతుల బతుకులు దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశాన్ని పాలించే అర్హత బీజేపీకి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదోళ్ల భూములు గుంజుకోవడంలో బిజీ అయ్యిందని, రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి అతీ గతీ లేదన్నారు. హుజూరాబాద్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడం లేదని, దుర్మార్గపు ఎన్నికలు జరుగుతున్నాయని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు.