KCR: నేడు కరీంనగర్ లో బీఆర్ఎస్ ‘కథనభేరి’ సభ నిర్వహించబోతుంది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. నేడు సాయంత్రం 5:30 గంటలకి కరీంనగర్ లో కథనభేరి సభ నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్‌ను సెంటిమెంట్‌గా భావిస్తారు. 2001లో ఎక్కడైతే తెలంగాణ ఉద్యమ బావుటాను ఎగురవేశారో ఇప్పుడు అక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. కలిసొచ్చిన ఎస్సారార్ కళాశాల మైదానం వేదికగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు కదనభేరి సభ నిర్వహిస్తున్నారు. అధినేత కేసీఆర్ సహా పార్టీ అగ్రనాయకత్వం హాజరవుతుండగా, కళాశాల మైదానంలో సభా వేదికతోపాటు సభికుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
Read also: Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్రం గుడ్ న్యూస్.. గోల్టెన్ అవర్ పేరుతో మరో పథకం!
ముఖ్య కార్యక్రమాలన్నీ కరీంనగర్ నుండే కేసీఆర్ ప్రారంభిస్తారని, అదే సెంటిమెంట్ తో పార్లమెంట్ ఎన్నికల కథనభేరి కూడా కరీంనగర్ నుండే ప్రారంభం అవుతోందని గంగుల కమలాకర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతికేత మొదలైందని, ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా గులాబీ శ్రేణులు నిలుస్తారని గంగుల పేర్కొన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్, గులాబీ జెండా ఎంతలా పోరాడిందో అందరికీ తెలుసని అన్నారు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీలు పార్లమెంట్ లో ఉండాలని తెలిపారు. మేడిగడ్డ కుంగినాక మూడు నెలలుగా ప్రభుత్వం రిపేర్లు చేయడం లేదు.. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉంటే ఈ పాటికి తాత్కాలిక రిపేర్లు చేసేవారని పేర్కొన్నారు. ఓ వైపు పంట పొలాలు ఎండిపోతుంటే ప్రభుత్వం ఇంకా చూస్తేనే ఉంది.. నీళ్లు లేక ఎండిపోయిన పొలాలకి రైతులు నిప్పు పెట్టుకుంటున్నారని తెలిపారు. మేడిగడ్డ విషయంలో సమయం వృధా చేస్తూ వచ్చారు.. ఈ సమస్యలన్నీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రస్తావిస్తారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
CM Jagan: నేడు విజయవాడకు సీఎం.. పలు అభివృద్ది పనులను ప్రారంభించనున్న జగన్..!