NTV Telugu Site icon

Chinnamail Anji Reddy: ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి.. 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌..

Bjp Anji Reddy

Bjp Anji Reddy

Chinnamail Anji Reddy: తెలంగాణలో పట్టభద్రులు, టీచర్‌ ఎమ్మెల్సీల్లో ప్రచారాన్ని ఉధృతం చేశారు ఆయా పార్టీల అభ్యర్థులు.. ఉమ్మడి కరీంనగర్ – ఆదిలాబాద్ – మెదక్ – నిజామాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్‌ చిన్నమైల్‌ అంజిరెడ్డి.. ఓవైపు ప్రచారం నిర్వహిస్తూనే.. మరోవైపు.. తాను గెలిస్తే ఏం చేస్తాను అనే దానిపై క్లారిటీతో వస్తున్నారు.. దానికి అనుగుణంగా.. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు అంజిరెడ్డి.. ‘విద్య, ఉపాధి, సంక్షేమం’ గ్రాడ్యుయేట్లకు అంజిరెడ్డి భరోసా పేరుతో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్‌ మేనిఫెస్టో – 2025 రిలీజ్‌ చేశారు.. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తర్వాత జోరుమీదున్న బీజేపీ.. ఆ ప్రభావం స్థానిక ఎన్నికల్లో కూడా కలిసివస్తోందని ఆశిస్తోంది.. బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా కరీంనగర్‌లో నిర్వహించిన పట్టభద్రుల సంకల్ప యాత్రకు బీజేపీ అగ్ర నేతలు విచ్చేసి అంజిరెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరిచారు.. 5 జీ కాలంలో కాంగ్రెస్‌ 3జీకి పరిమితమైందంటూ సెటైర్లు వేశారు.. రైతు డిక్లరేషన్, యూత్ డెకరేషన్, గ్యారంటీలు, హామీలు తుంగలో తొక్కిందని మండిపడ్డారు..

Read Also: Ms.ilayaa : మొదలైన “మిస్ ఇళయా”!

ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోను పట్టభద్రుల సంకల్ప యాత్రలో ఆవిష్కరించారు.. తన గెలుపు పై ధీమా వ్యక్తం చేశారు.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఘాటుగా విమర్శలు గుప్పించారు..

* గ్రాడ్యుయేట్ల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నా.. విద్యార్థులు – ప్రభుత్వ ఉద్యోగార్థులకు చేయూత ఇస్తా..

* స్వయం ఉపాధి – ఉద్యోగ అవకాశాల కల్పన.. ఉద్యోగ భద్రత – నిరుద్యోగ నిర్మూలనకు ప్రాధాన్యం..

* గ్రాడ్యుయేట్ల సంక్షేమం మరియి భద్రతకుకు పెద్దపీట.. ప్రతి పట్టభద్రుడి సామాజిక భద్రతకు హామీ

* ఉపాధ్యాయుల సంక్షేమం, ఉద్యోగుల హక్కులకై పోరాటం.. సమస్యల పరిష్కారానికి పోరాటం చేసేందుకు ప్రాధాన్యం..

* న్యాయవాదుల సంక్షేమానికి కృషి.. వారి సంక్షేమం, అభ్యున్నతికి ప్రోత్సాహం.

* వైద్య రంగ అభివృద్ధి – డాక్టర్ల సంక్షేమానికి హామీ.. ఆరోగ్య రంగ అభ్యున్నతి ప్రజారోగ్యానికి గ్యారంటీ.. లాంటి అంశాలను తన మేనిఫెస్టోలో పొందుపరిచారు..

ఇక, ఎన్నికైన వెంటనే 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌.. మేనిఫెస్టో అమలుకై పారదర్శక కార్యాచరణ.. ప్రజాభాగస్వాత్యంతో – ప్రజావేదిక నిర్వహణ అని.. హామీ ఇచ్చారు ఉమ్మడి కరీంనగర్ – ఆదిలాబాద్ – మెదక్ – నిజామాబాద్ పట్టభద్రుల స్థానం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్‌ అంజిరెడ్డి..