NTV Telugu Site icon

Bandi Sanjay: ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కానుక.. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కానుక.. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్, సిరిసిల్లలో ధీన్ ధయాల్ ఉపాధ్యాయ పథకం ద్వారా 800 మందికి తొంభై రోజులు యువతి యువకులకు శిక్షణ ఇచ్చామన్నారు. ఉచిత శిక్షణ, ఉచిత భోజన‌ సదుపాయం కల్పించామని తెలిపారు. 50 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. బీఆర్ఎస్ రెండు లక్షల ఉద్యోగాలు‌ ఇస్తామని మోసం చేసిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 25000 జాబ్ లకి నోటిఫికేషన్ ఇచ్చి 50000 ఉద్యోగాలు ఇచ్చామంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెబుతూ టైం పాస్ చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ‌మీద శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Read also: MKC Kavitha: కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేక.. నాపై, కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టారు..

రూ.7000 కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు‌ ఉన్నాయన్నారు. ప్రభుత్వం, యాజమాన్యాల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారని తెలిపారు. ఫీజు రీయంబర్స్మెంట్ కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ టెండర్స్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యిందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కానుకన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం అన్నారు. మన్మోహన్ సింగ్ ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధాని అని గుర్తుచేశారు. మన్మోహన్ సింగ్ ని రబ్బర్ స్టాంప్ చేసిన‌ పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్, పీవీ నరసింహరావు,ప్రణవ్ ముఖర్జీ లని అవమానించారన్నారు. మన్మోహన్ సింగ్ కి బీజేపీ తగిన గౌరవం ఇచ్చిందన్నారు.
Harish Rao: బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతుంది..

Show comments