Site icon NTV Telugu

Bandi Sanjay: బుల్డోజర్లు ముందు మా మీద.. ఆ తరువాత పేదల ఇళ్ల వద్దకు..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: హైడ్రా బుల్డోజర్లు ముందు మా మీద నుండి వెళ్ళాలి.. అప్పుడే పేదల ఇళ్ల వద్దకు వెళ్తాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పై కిషన్ రెడ్డి రాగానే బీజేపీ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పేదలకు అండగా బీజేపీ ఉంటుందన్నారు. ఒకటి రెండు రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. బుల్డోజర్ ముందు మా మీద నుండి వెళ్ళాలని.. అప్పుడే పేదల ఇళ్ల వద్దకు వెళ్తాయన్నారు. తెలంగాణ లో హైడ్రా పాపం కాంగ్రెస్ కు తగులుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ఇబ్బందులు తలెత్తిన అధికారులతో మీడియా సమావేశం పెట్టి తప్పును కప్పి బుచ్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా రాజ్యం అంటే పేదల ఇళ్ళు కూల్చడమా?? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపిస్తుందని మండిపడ్డారు. పట్టాలు , లింకు డాక్యుమెంట్స్ , గ్రామా పంచాయితీ అనుమతి ఉందని తెలిపారు. అందులో ఉన్నవారంతా పేదలే అన్నారు. హైడ్రా వల్ల ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమీక్ష చేయాలని బండి సంజయ్ తెలిపారు.
VC. Sajjanar: నేటితో మహాలక్ష్మి పథకానికి మూడు వందల రోజులు.. 90 కోట్ల మంది ప్రయాణం..

Exit mobile version