Site icon NTV Telugu

Marijuana intoxication: గంజాయి మత్తులో యువతి హల్చల్.. ఆటో డ్రైవర్లపై దాడి

Marijuana Intoxication

Marijuana Intoxication

Marijuana intoxication: గంజాయి మత్తులో యువత జోగుతుంది. విచ్చలవిడిగా లభిస్తున్న మత్తుకు బానిసలుగా మారుతున్నారు. యదేచ్ఛగా యువత గంజాయి తీసుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా గంజాయి వినియోగిస్తుండటంతో మైనర్లు సైతం దీనికి బానిసలు అవుతున్నారు. గంజాయి మత్తులో జీవితం నాసనం చేసుకుంటున్నారు. మద్యం, గంజాయి మత్తులో ఓ యువతి హల్ చల్ చేసింది. అడ్డు వచ్చిన వారి పై బూతులు తిడుతూ,రాళ్ళతో దాడికి దిగింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో చోటు చేసుకుంది.

Read also: SSMB 28: ‘అమరావతికి అటు ఇటు’ దగ్గరే ఆగకపోవచ్చు…

కరీంనగర్ కు చెందిన యువతి ఆటో కిరాయి తీసుకొని గోదావరిఖనిలోని తన బందువుల ఇంటికి వచ్చింది. ఆ యువతికి ఏమని పించిందో ఏమో గానీ చౌరస్తా లో దిగింది. దీంతో ఆటో డ్రైవర్ ఆమెను డబ్బులు అడిగాడు. ఆయువతి ఆగ్రహంతో ఊగిపోయింది. మత్తులో వున్న ఆమె డ్రైవర్ పై బూతుపురాణం మొదలు పెట్టింది. అంతటితో ఆగక చుట్టుపక్కల ఉన్న రాళ్లతో దాడికి దిగింది. రాళ్లు తీసి ఆటో డ్రైవర్‌పైకి విసిరింది. డ్రైవర్‌ గట్టిగా కేకలు వేయడంతో.. అక్కడే వున్న స్థానికులు ఆయువతికి అడ్డువచ్చారు అయితే వారిపై కూడ దాడి చేసింది. అయితే.. అమ్మాయి కావడంతో పాపం ఆ ఆటో డ్రైవర్ ఏం చేయలేక సైలంట్ అయిపోయాడు. చుట్టుపక్కల వాళ్లు వచ్చిన కూడా అమ్మాయిని కంట్రోల్ చేయలేకపోయారు. ఆయువతి అక్కడి నుండి మళ్లీ గోదావరిఖని బస్టాండ్ కు వెళ్లింది..అక్కడ కూడ ముగ్గురు ఆటో డ్రైవర్ల పై దాడి చేసింది. దీంతో విసిగిపోయిన ఆటో డ్రైవర్లు గోదావరిఖని వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువతి బ్యాగును పరిశీలించగా మద్యం సీసా లభ్యమైంది. ఆ యువతి మద్యంతో పాటు గంజాయి సేవించిన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే.. ఆయువతి మద్యం మత్తులో గమ్యాన్ని చేర్చిన ఆటో డ్రైవర్ కు డబ్బులు ఇవ్వకపోగా.. బూతులు తిడుతూ దాడికి పాల్పడి యువతి హల్ చల్ చేయడం కలకలం రేపింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అక్కడి నుండి పారిపోయింది. ఆయువతికి సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. తను ఎందుకు ఇక్కడికి వచ్చింది, ఎటు వెళ్తుంది, ఎక్కడికి వెళ్లిందో తెలియాల్సి ఉంది. ఈఘటన నిన్న రాత్రి జరగడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Covid-19: దేశంలో కరోనా విజృంభణ.. 5 నెలల గరిష్టానికి రోజువారీ కేసులు

Exit mobile version