Site icon NTV Telugu

Karimnagar: మున్సిపల్ అధికారులకు షాక్.. ఇంటి పన్ను వెనక్కి ఇవ్వండంటూ

Karimnagar

Karimnagar

Karimnagar: ఇంటి పన్ను వసూలు చేయడంలో మున్సిపల్ కార్పొరేషన్ చూపిస్తున్న శ్రద్ధ, రోడ్ల మరమ్మత్తులో చూపడం లేదంటూ కరీంనగర్ ప్రజలు తమ నిరసనను వినూత్నంగా తెలిపారు. రోడ్లపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో, వాటిలో వరి నాట్లు వేస్తూ 9వ డివిజన్‌లోని నివాసితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని, తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తమ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ప్రజలు ఆరోపించారు. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లన్నీ నీటి గుంతలతో నిండిపోయి, ప్రయాణం కష్టంగా మారుతోందని వాపోయారు. ముఖ్యంగా, పాఠశాలలకు వెళ్లే పిల్లలు, అలాగే వృత్తి పనులకు వెళ్లే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Asia Cup 2025: మదమా లేక అహంకారామా? షేక్ హ్యాండ్ వివాదంతో టోర్నీ నుండి పాకిస్తాన్ అవుట్?

“ఇంటి పన్ను వసూలు చేసే సమయంలో చూపించే శ్రద్ధ రోడ్ల మరమ్మత్తుల విషయంలో ఎందుకు చూపడం లేదు?” అని స్థానికులు మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. “మా రోడ్లను వెంటనే మరమ్మత్తు చేయండి, లేదంటే మేము చెల్లించిన ఇంటి పన్ను డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి” అని మున్సిపల్ కార్పొరేషన్‌ను డిమాండ్ చేశారు. ఈ వినూత్న నిరసన ద్వారా స్థానిక సమస్యను అధికారుల దృష్టికి తీసుకురావడమే కాకుండా, ప్రజల కష్టాలను కూడా తెలియజేశారు. మరి ఈ నిరసన తర్వాత అయినా మున్సిపల్ కార్పొరేషన్ స్పందిస్తుందేమో చూడాలి.

Tummala Nageswara Rao : రైతులకు షాక్.. యూరియా కొరతపై తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

Exit mobile version