మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని త్రీటౌన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది కరీంనగర్ మున్సిఫ్ కోర్టు.. హిందూ దేవతలను ప్రతిజ్ఞ ద్వారా కించపరిచారంటూ న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి ఫిర్యాదు చేయగా… ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదుకు మున్సిఫ్ కోర్టు జడ్డి ఆదేశాలు జారీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా మూడో పట్టణ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వోకు ప్రిన్సిపాల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్
మేజిస్ట్రేట్ సాయిసుధ ఆదేశాలు ఇచ్చారు. కాగా, తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఉన్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తూ… రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయగా… ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదుకు ఆదేశాలు

RS Praveen Kumar