పాదయాత్రలో భాగంగా షేక్ పేట్ నాలా దగ్గర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చాక మెదటి బహిరంగ సభ భాగ్యలక్ష్మీ దేవాలయం వద్ద నిర్వహిస్తామన్నారు. తెలంగాణ బీజేపీ అడ్డా.. 2023లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేసేవరకు పోరాటం చేస్తాం. ప్రజా సంగ్రామ యాత్రకు భారీగా తరలివస్తోన్న భాగ్యనగర్ ప్రజలకు సెల్యూట్ చేస్తున్న. పాతబస్తీకి మెట్రోరైల్ ను ఎంఐఎం పార్టీ అడ్డుకుంది. పాతబస్తీని అభివృద్ధి ఎందుకు చేయటలేదో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలి. పాతబస్తీలో హిందూ సమాజానికి బీజేపీ అండగా ఉంటోంది అని తెలిపారు. పాతబస్తీలో బీజేపీ కోసం హిందూ సమాజం సంఘటితమవుతోంది. ఇక గో రక్షణ కోసం కృషి చేస్తోన్న ఎమ్మెల్యే రాజసింగ్ పై కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాను అని పేర్కొన్నారు.