ఒకాయన నన్ను కోతి అంటున్నరు. టీఆర్ఎస్ ను చూసి కోతులన్నీ భయపడి పోతున్నయ్. ఎందుకంటే గుంట నక్కలు, దండు పాళ్యం ముఠా లెక్క జనంమీద పడి దోచుకుంటున్నరు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. బండి సంజయ్ కొదమ సింహం లాగా అడ్డుకుని కొట్లాడి తీరతడు.వచ్చేనెల 2న కేసీఆర్ కు ప్రగతి భవన్ లో ‘ట్రిపుల్ ఆర్ ’ సినిమా చూపిస్తాం. 30న జరిగే ఎన్నికల్లో పువ్వు గుర్తుకే అందరూ ఓటేయ్యాలి. మీరు వేసే ఓట్లతో కేసీఆర్ షాక్ కావాలి. బండి సంజయ్ మీటింగ్ కు 20 మంది మాత్రమే వచ్చారని కేసీఆర్ చెబుతుండు…చెప్పినోడికి చెవుల్లేవు. టీఆర్ఎసోళ్లు ఎన్నికలు వాయిదా వేస్తే బాగుండని అనుకుంటన్నరు. ఎందుకంటే డబ్బులు, మందు కేసీఆర్ అప్పటిదాకా పంపుతారని ఆశ పడుతున్నరు అని అన్నారు.
ఇక కిషన్ రెడ్డిపై దాడి చేస్తే భయపడే ప్రసక్తే లేదు అని చెప్పిన బండి సంజయ్… సీఎం మాట్లాడితే వరి వేస్తే ఉరి అన రైతులను భయపెడుతున్నరు. రైతులు తమ పొలంలో ఏ పంట వేయాలనే వాళ్ల ఇష్టం. కేసీఆర్ ఎవరు….చెప్పడానికి అని అన్నారు. అసలు బియ్యానికి-రైతుకు సంబంధమేంది? రైతులు వడ్లు మాత్రమే అమ్ముతారు. మిల్లర్లతో కుమక్కైన కేసీఆర్ కమీషన్లు రావడం లేదనో అక్కసుతో వరి వేస్తే ఉరే అని భయపెడుతున్నరు. ఎరువుల కొనుగోలుపై ఎకరాకు రూ.1800లకుపైగా యూరియాపైన, డీఏపీపై రూ.1250ల చొప్పున రూ.2400లు సబ్సిడీ ఇస్తోంది. నరేంద్రమోదీ ప్రభుత్వమే. మొత్తంగా ఎకరానికి రూ.5 నుండి రూ.6 వేల వరకు సబ్సిడీని కేంద్రం అందిస్తోంది. కేసీఆర్ మాత్రం రైతు బంధు మినహా అన్ని సబ్సిడీలను బంద్ చేసి రైతుల పొట్టకొడుతున్నరు అని పేర్కొన్నారు.
