NTV Telugu Site icon

MLA Kandala Upender Reddy: కమ్యూనిస్టులకు ఓట్లు వేసే రోజులు పోయాయి.. అయినా సీటు నాకే వస్తుంది

Kandala

Kandala

Kandala sensational comments in Paleru Constituency: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఫాస్టర్స్ మీటింగులో కందాల సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్మ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయని అన్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదన్నారు. ఏదో ప్రజాచైతన్య యాత్రలు పెట్టి మాకే సీట్లంటున్నరని తెలిపారు. ఖచ్చితంగా నేనే పోటీ చేస్తా… మనమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేను మంచి చేస్తాననే నమ్మకముంటే నాకు ఓట్లు వేయండి అన్నారు. వార్ వన్ సైడే, పాలేరులో మనమే పోటీ చేస్తామన్నారు. అట్టడున ఉన్న ప్రజలకు నేను సహాయం చేస్తున్నానని కందాల వ్యాఖ్యలు హాట్ టాపిక్‌ గా మారాయి.

Read also: Jacqueline Fernandez: బేబీ నిన్ను మిస్సవుతున్నా.. జైలు నుంచి సుఖేష్ ప్రేమలేఖ

పాలేరు ఎంఎల్ఎ కందాల ఉపేందర్ రెడ్డి హాట్ కామెంట్ ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. పాలేరు నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ గా ఉంటుందని నాకే సీటు వస్తుందన్నారు. ఖచ్చితంగా నేనే పోటీ చేస్తానని అన్నారు. మీకు నచ్చితేనే ఓట్లు వేయండి. నాకంటే ఇంక ఎవ్వరన్న నచ్చితే వారికి కూడ ఓట్లు వేయండని అన్నారు. నేనే గెలుస్తాను.. అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. ఎవ్వరు మంచి వారు అనుకుంటే వారికి ఓటు వేయండని తెలిపారు. అందరితో నేను కలుపుకుని పోతానని పాలేరు ఎంఎల్ఎ కందాల ఉపేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఒక్కవైపు పాలేరు సీటును బిఆర్ఎస్ నుంచి మళ్లీ తుమ్మల నాగేశ్వర రావు పోటీ చేయడానికి పావులు కదుపుతుండగా మరో వైపున పాలేరు నుంచి సీపీఎం పోటీ చేస్తుందని ప్రచారం కూడ సాగుతుంది. నిన్న సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన జన చైతన్య యాత్రలో తమ్మినేని మాట్లాడుతు ఎవ్వరు పోటీచేసిన పార్టీ నిర్ణయాల ప్రకారం మద్దతు ఇస్తామని చెప్పాడు. ఆ సభలో తమ్మినేని, కందాల ఇద్దరు పాల్గొన్నారు. ఇటువంటి సందర్బంగా కందాల ఉపేందర్ రెడ్డి ఈ రోజు మళ్లీ నేనే పోటీ చేస్తానని, నేనే గెలుస్తానని చెప్పడం.. నాకే సీటు వస్తుందనడంపై వివాదస్పదంగా మారింది.
Bungee Jumping : బంగీ జంప్ చేశాడు.. బురదలో పడ్డాడు.. లేకుంటే మనోడి పని?