రాగిపిండితో మనం రాగి జావ , రాగి సంకటి, రాగి రోటీ వంటివి సాధారణంగా చేసుకునే ఆహారాలు. మీరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ గా రాగి దోశ, రాగి ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు.
ఇవి కాకుండా రాగి ఉప్మా చేసుకోవచ్చని మీకు తెలుసా? ఉప్మా మనం రవ్వతో చేసుకునే అల్పాహారం, ఇది ఎంతో ఆరోగ్యకరమైనది.
రాగి రవ్వతో ఉప్మా చేసుకుంటే అది మరింత ఆరోగ్యకరమైన అల్పాహారంగా మారుతుంది. రోగాలను నయం చేసి ఎముకలు పటిస్టంగా ఉండేందుకు దోహద పడుతుంది.
రాగిమాల్ట్ తాగితే ఎన్ని ఉపయోగాయో.. దానికంటే ఎక్కువగా రాగిఉప్మాతింటే అంత ఉపయోగం అన్నమాట.
కొంతమంది దీన్ని తాయారు చేసేందుకు కష్టాలు పడుతుంటారు.
మీరు అంతకష్టపడాల్సిన అవసరం కూడా లేకుండా రాగిఉప్మాకు సంబంధించిన రెడీమేట్ ప్యాకెట్లు కూడా షాపుల్లో లభిస్తున్నాయి.