Doctors in Kamareddy: కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. ఎలుకల దాడుల నేపథ్యంలో డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ సస్పెన్షన్ పై వైద్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కామారెడ్డి ఆస్పత్రి వైద్యుల సస్పెన్షన్ పై నిరసనలు చేపట్టారు. దీనిపై వైద్యులు మాట్లాడుతూ.. ఎలుకలు పేషంట్స్ నీ కొరికితే వైద్యులను ఎందుకు బలి చేస్తున్నారు? అని ప్రశ్నించారు. శానిటేషన్ సిబ్బంది పై కాకుండా వైద్యులపై ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? అని మండిపడ్డారు. గత ప్రభుత్వం అనాలోచిత చర్యల వల్ల మెడికల్ కాలేజీలు నిర్మాణం కన్నా ముందే షెడ్ లల్లో మెడికల్ కాలేజీ లను ప్రారంభించారని తెలిపారు. వంద పడకలున్న జిల్లా ఆస్పత్రి నీ మెడికల్ కాలేజీ చేశారని అన్నారు. వంద మందికి సరిపడా శానిటేషన్ స్టాఫ్ ఉన్నారు. ఇప్పుడు హాస్పటల్ లో బెడ్స్ సంఖ్య 350 కి పెంచారని తెలిపారు. గత ప్రభుత్వం నియామకాలు చేపట్టకపోవడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నయని వైద్యులు మండిపడుతున్నారు. ఇవ్వాళ ఆరోగ్య శాఖ మంత్రి తో ప్రభుత్వ వైద్యుల చర్చలు ఉన్నాయని తెలిపారు. అయితే వెంటనే డాక్టర్ల పై విధించిన సస్పెన్షన్ నీ ఎత్తివేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.
Read also: Revenue Employees Pen Down: ఎమ్మార్వో రమణయ్య హత్య ఘటన.. రెవెన్యూ ఉద్యోగుల పెన్‌డౌన్..
కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై సర్కార్ సీరియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై వేటు వేసింది. ఐసీయూ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ వసంత్ కుమార్, కావ్య తో పాటు సర్సింగ్ ఆఫీసర్ మంజులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విచారణ ఆదేశించారు. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అయితే వైద్యుల సస్పెన్షన్ నిరసనలు చేపట్టారు. ఎలా సస్పెన్షన్ చేస్తారు? అది ఎవరిది తప్పు? వైద్యులదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిరసనలతో రోగులు సరైన వైద్యం అందకా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
Vennela Kishore: సీరియస్ ఆపరేషన్‌ను కామెడీ చేసిన ఏజెంట్ ‘చారి 111’…