NTV Telugu Site icon

ఖత్తర్‌ నుంచి కామారెడ్డికి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌..

తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఇండియాలో కూడా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌ దాని ప్రభావాన్ని చూపుతోంది. అయితే కామారెడ్డి జిల్లా రాజాంపేట మండలం తలమడ్ల గ్రామానికి ఇటీవల ఖత్తర్‌ నుంచి ఓ వ్యక్తి వచ్చాడు.

ఆ వ్యక్తికి 5 రోజుల క్రితం కరోనా పాజిటివ్ తేలడంతో జీనోమ్ పరీక్షకు పంపగా ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో ఒక్కసారిగా ఆ గ్రామంలో అందరూ భయాందోళనకు గురయ్యారు. అలాగే మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్ రావడంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.