NTV Telugu Site icon

Kalvakuntla Sanjay: వడ్ల స్కాం బయటికి వచ్చింది కాబట్టే ఫోన్ ట్యాపింగ్ లీక్ ఇచ్చారు..

Kalvakuntla Sanjay

Kalvakuntla Sanjay

Kalvakuntla Sanjay: వడ్ల స్కాం బయటికి వచ్చింది కాబట్టే ఫోన్ ట్యాపింగ్ లీక్ ఇచ్చారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. గత అరునెలల నుండి లీకులు,స్కాం ల మీదనే ప్రభుత్వం నడుస్తుందన్నారు. మంత్రి జూపల్లి‌ కృష్ణారావు లిక్కర్ స్కాం‌ బయటికి వచ్చిందన్నారు. వడ్ల స్కాం బయటికి వచ్చింది కావుననే ఫోన్ ట్యాపింగ్ లీక్ ఇచ్చారన్నారు. లీకేజ్ లతో తెలంగాణ ప్రజల దృష్టిని మరల్చుతున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ లో నిజానిజాలు మొత్తం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ‌ప్రభుత్వం‌ స్కాంగ్రెస్ గా‌ మారిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి తెలంగాణ లో గుడుంబాని‌ మళ్ళీ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ లో నిజాలు తేలితే కేసులు పెట్టి జైలుకు పంపాలన్నారు.

Read also: Bharateeyudu 2 : ‘భారతీయుడు 2’ సెకండ్ సింగిల్ రిలీజ్ టైం ఫిక్స్..

పండించిన వరిపంటకు ఇస్తానన్న 500 బోనస్ ఇవ్వడం లేదన్నారు. కాళేశ్వరం రిపేర్ చేయరాదన్న ప్రభుత్వమే రిపేర్ చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జనరేటర్ లు, ట్యాంకర్ లలో నీరు కొనుక్కునే పరిస్థితి వస్తుందన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ కి మూడవస్థానం‌ వచ్చిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల ఓడిపోయానని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఐదుసార్లు పోటిచేసిన గెలవని వ్యక్తి జువ్వాడి నర్సింగరావు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ రాజా నర్సింగరావు ఇప్పుడు ‌కలెక్షన్ రాజాగా మారాడన్నారు. అరెస్టు అయిన‌ వారితో ఫోన్ ట్యాపింగ్ నలుగురి పేర్లు చెప్పించారన్నారు.
Nizamabad: స్కానింగ్ కు వచ్చే మహిళలపై వికృత చేష్టలు.. న్యూడ్ ఫోటోలతో బెదిరింపు..