NTV Telugu Site icon

MLC Kavitha: గవర్నర్ తమిళిసైకి కవిత కౌంటర్.. వాటినే మళ్లీ అడిగినందుకు ధన్యవాదాలు

Tamilasai Mlc Kavitha

Tamilasai Mlc Kavitha

MLC Kavitha: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై.. సీఎం కేసీఆర్‌ పై చేసిన వ్యాఖ్యలకు కవిత ట్వీటర్ వేదికగా స్పందించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే , దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందన్నారు. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా….రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే మేము పోరాడుతున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్ కి ధన్యవాదాలు అంటూ గవర్నర్‌ మాట్లాడిన మాటలను వీడియో ద్వారా ఆమె తమ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈవీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది.

తెలంగాణ రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వం పై విమర్షలు గుప్పించిన విషయం తెలిసిందే.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది అన్నారు. మేధావులు, మహాన్నత వ్యక్తులు మన రాజ్యాంగం రూపొందించారన్నారు. రాజ్యాంగ రచనలో అంబేడ్కర్‌ ఎంతో అంకితభావం కనబరిచారన్నారు. వైద్య, ఐటీ రంగాల్లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. శాతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోందని తెలిపారు. తెలంగాణ ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉందన్నారు గవర్నర్‌. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని తెలిపారు. తెలంగాణలో ఆందోళన కర పరిస్థితులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు గవర్నర్‌ తమిళిసై. రాష్ట్రం లో రోజుకు 22 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు.

Read also: Revanth Reddy: గవర్నర్, సీఎంల మధ్య విభేదాలు ఉంటే వేరే వేదిక చూసుకోవాలి.. ఇది సరైన పద్దతి కాదు..

కొందరికి ఫార్మ్ హౌస్ లు కాదు.. అందరికీ ఫార్మ్ లు కావాలని గవర్నర్‌ తమిళిసై అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కును కాపాడుకుందామని తెలిపారు. కొంత మందికి నేను నచ్చక పోవచ్చు కానీ.. నాకు తెలంగాణ వాళ్ళు అంటే ఇష్టమన్నారు. ఎంత కష్టం అయిన పని చేస్తానని సంచలన వ్యాక్యలు తెలిపారు. పవిత్ర తెలంగాణ నేలపై జాతీయ జెండా ఎగురవేయడం గర్వంగా ఉందన్నారు. దేశభక్తితో కూడిన ఆరు దశాబ్దాల ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం అని తెలిపారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తామని తెలిపారు. రైతులు, పేదలు అందరికీ భూములు, ఇండ్లు కావాలన్నారు. ధైర్యంగా ఉండాలని యువతకు విజ్ఞప్తి చేశారు గవర్నర్‌. తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టుకుందాం.. తెలంగాణ అభ్యుదయంలో నా పాత్ర ఉంటుందని తెలిపారు. దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్‌ తో కనెక్టవిటీ ఉందని అన్నారు గవర్నర్‌ తమిళిసై. అయితే గవర్నర్ వ్యాఖ్యలకు ఎంఎల్ సీ కవిత తన ట్వీటర్ ద్వారా కౌంటర్ ఇవ్వడంతో ఈట్వట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
Raghunandan Rao: ఖమ్మంలో బహిరంగ సభ పెడితే.. కరోనా పాండమిక్ ఉండదా?