Site icon NTV Telugu

Kalvakuntla Kavitha : తెలంగాణలో తుపాకీ పట్టిన మొట్టమొదటి మహిళ మల్లు స్వరాజ్యం

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (93) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్‌లోని సీపీఎం కార్యాలయంలో ఆమె పార్తివ దేహాన్ని సందర్శనార్థం ఉంచారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మల్లు స్వరాజ్యం తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని, మాలాంటి ఉద్యమకారులకు స్ఫూర్తి నిలిచిన వ్యక్తి అని ఆమె అన్నారు.

తెలంగాణలో తుపాకీ పట్టిన మొట్టమొదటి మహిళగా కీర్తి గడించారని, మల్లు స్వరాజ్యం పట్టిస్తే రూ. 10 వేల రూపాయలు బహుమతి ఇస్తామని ఆనాడు ప్రకటించడమంటే ఎంత గొప్పగా పోరాటం చేశారో అర్థం అవుతోందని ఆమె అన్నారు. రెండో దశ తెలంగాణ ఉద్యమంలోనూ అనేక సందర్భాల్లో మల్లు స్వరాజ్యం నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నామని, వారి కుటుంబానికి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామన్నారు.

Exit mobile version