NTV Telugu Site icon

KA Paul: హైదరాబాద్ ప్రజలు నా మాట విన్నారు..

Ka Paul

Ka Paul

KA Paul: హైదరాబాద్ ప్రజలు నా మాట విన్నారని, నూటికి 40 శాతం మాత్రమే ఓటేశారని.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ అన్నారు. సీఈఓ వికాస్ రాజ్ ఒక పెద్ద డ్రామా నడుపుతున్నారని అన్నారు. అవినీతి చక్రవర్తిగా సీఈఓ మారుతున్నారని తెలిపారు. సీఈఓ వికాస్ రాజ్ పై చీఫ్ జస్టిస్ కు ఫిర్యాదు చేశామన్నారు. 30వ తేదీ రాత్రి తుంగతుర్తిలో ఈవీయంలు కనబడటం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని 30 స్థానాల్లో ఈవీయంలు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు 58 – 63 సీట్లు వస్తున్నాయని సర్వేలు చెపుతున్నాయన్నారు.

Read also: DK Sivakumar: కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్.. రంగంలోకి దిగిన డీకే శివకుమార్

కాంగ్రెస్ అభ్యర్థులతో కేసీఆర్, కేటీఆర్ మాట్లాడుతున్నారని, వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. కేసీఆర్ దగ్గర ఉన్న డబ్బుతో వికాస్ రాజ్ ను కొనేశారా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్వోలు అవినీతి చేస్తున్నారని మండిపడ్డారు. తను వికాస్ రాజ్ కు అనేక ఫిర్యాదులు చేసా.. ఒక్కటి కూడా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ దగ్గర డబ్బులు ఎందుకు సీజ్ చేయలేదు? అని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రజలు నా మాట విన్నారని అన్నారు. నూటికి 40 శాతం మాత్రమే ఓటేశారని ఆనందం వ్యక్తం చేశారు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ లో నక్సలైట్ల దాడి .. ఇద్దరు CRPF జవాన్లకు గాయాలు..

Show comments