KA Paul sensational comments on CM KCR birthday: నేను రావాలని తెలంగాణకు వున్న కోట్ల అప్పులు తీరాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఢిల్లీ తెలంగాణ భవన్ లో కె.ఏ.పాల్ సీఎం వేడుకలు జరిపారు. కేక్ కట్ చేసి, కేసీఆర్ బావుండాలని ప్రార్ధన చేశారు.పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని కోరారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పి కేసీఆర్ ప్రజా సేవ చేయాల అన్నారు. బడుగు బలహీన వర్గాలు కోసం కేసీఆర్ నిస్వార్థంగా పనిచేయాలని అన్నారు. పాల్ లాంటి ఆదర్శ వ్యక్తి ఎక్కడా ఉండరని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మీడియాకి చూపించారు. కేసీఆర్ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. నేను అధికారంలోకి రావాలని కేసీఆర్ తన ఇష్ట దైవాన్ని కొలవాలని తెలిపారు. నేను వస్తేనే తెలంగాణ 5 లక్షల కోట్లు అప్పులు తీరుతాయని వ్యాఖ్యానించారు. దేశంలో ఉన్న ఆర్ధిక ,రాజకీయ సంక్షోభాలను నేనే పరిష్కరించగలనని అన్నారు. కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకుని ఎస్సీ, ఎస్టీలకు సహకరించాలని కెఏ పాల్ కోరారు.
Read also: KTR Twitter: మోడీ జీ.. అబద్ధాన్ని ఒకేలా చెప్పేలా మీ మంత్రులందరికి ట్రెయినింగ్ ఇవ్వండి
భారతీయ మీడియా సంస్థల్లాగా అంతర్జాతీయ మీడియాను నోరు మూయించ లేరని, వాటిని కొనుగో చేయలేరని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ తీసినందుకే ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే గడిచిన 9 ఏళ్లుగా బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ఠ దిగజారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీబీసీ ని నోరు మూయించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా..? అని ప్రశ్నించారు. పత్రికా స్వేచ్ఛ ను కేంద్రం నియంత్రించలేదని అన్నారు. డాక్యుమెంటరీ నచ్చకపోతే కోర్టుకి వెళ్ళాలి అని సూచించారు. అంతర్జాతీయ మీడియా నోరు మూయించగలరా? అంటూ ప్రశ్నించారు. అంతర్జాతీయ మీడియాతో మోడీ యుద్ధం చేయవద్దని సూచించారు. మోడీ,అమిత్ షా,విదేశాంగ శాఖ అంతర్జాతీయ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, రాజకీయాలు చేయోద్దు.. ఇది దేశానికి ప్రమాదకరం అన్నారు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రులు, నేతలు అంతా బానిసలు అని విమర్శలు గుప్పించారు. తెలంగాణ సచివాలయం ఏప్రిల్ 14న ప్రారంభిస్తామని, మరో మూడు రోజుల్లోగా ప్రకటించకపోతే ఫిబ్రవరి 17న తెలంగాణ వ్యాప్తంగా జిల్లా కలెక్టరరేట్ల ఎదుట అంబెడ్కర్ మద్దతు దారులు ఆందోళనలు చేయాలని పేర్కొన్నారు. నేను ఢిల్లీ లేదా హైదరాబాద్ లో ఆమరణ నిరాహారదీక్ష చేపడతా! అని స్పష్టం చేశారు. దళితులను కేసీఆర్ మోసం చేస్తున్నారు.. ఇచ్చిన హామీలేవి అమలుపరచలేదని ఆరోపించారు. ఏప్రిల్ 14న తెలంగాణ అంబెడ్కర్ సచివాలయం ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
Nude Video Call: అబ్బాయిలు అలర్ట్.. న్యూడ్ కాల్ చేసి లక్షలు కాజేస్తున్న కిర్రాక్ లేడీలు