NTV Telugu Site icon

KA Paul: కేఏ పాల్‌ను చంపేందుకు కుట్ర..!

Ka Paul

Ka Paul

KA Paul: ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.. మెడికో ప్రీతి కేసు, ఇతర ప్రభుత్వాల వైఫల్యాలపై నేను గట్టిగా ప్రశ్నించినందుకు నన్ను టార్గెట్‌ చేశారు. నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు.. నాపై ఉన్న తప్పుడు కేసును రీఓపెన్‌ చేశారు.. అది తప్పుడు కేసు అంటూ గతంలో ఖండించిన కేసీఆర్‌.. ఇప్పుడు కుట్ర చేస్తున్నారు.. స్టే ఉన్న మహబూబ్‌నగర్‌ కేసును ఓపెన్‌ చేసి.. నన్ను మహబూబ్‌నగర్‌ పంపి.. మా అన్నయ్యను చంపిన టీమ్‌ ద్వారా… నన్ను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు..

Read Also: Etela Rajender: మాక్సిమం పాలిటిక్స్ మినిమం రూలింగ్.. ఇదే కేసీఆర్ పాలన

గతంలో నన్ను జైలులో పెట్టి.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చంపేందుకు కుట్ర చేశారని ఆరోపించిన కేఏ పాల్.. ఇప్పుడు అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా కుట్ర పన్నుతున్నారని విమర్శించారు.. నాపై ఉన్న కేసు చట్ట విరుద్ధమని హైకోర్టు స్టే ఇచ్చిందన్న పాల్.. ఇప్పుడు రీ ఓపెన్‌ చేసి.. నాపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇక, మధ్యలో ఢిల్లీ లిక్కర్‌ కేసు ప్రస్తావన తీసుకువచ్చారు. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు.. కేసులు, అరెస్ట్‌లను ప్రస్తావించారు.. కేఏ పాల్‌ చేసినసంచనల వ్యాఖ్యల కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Show comments