Site icon NTV Telugu

KA Paul : సహస్ర కేసులో ఓ చట్టాన్ని తీసుకురావాలి

Ka Paul

Ka Paul

KA Paul : కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కి చేరుకుని బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. సహస్ర హత్యను కేఏ పాల్ తీవ్రంగా ఖండించారు. “బాలిక సహస్రను ఎంతో బాగా పెంచిన తల్లిదండ్రులు ఇంతటి దుర్ఘటనను ఎదుర్కోవడం బాధాకరం. కూకట్‌పల్లి పోలీసులు వేగంగా విచారణ జరిపి నిందితుడిని పట్టుకోవడం ప్రశంసనీయ విషయం. కానీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ‘సహస్ర చట్టం’ రూపంలో కఠినమైన చట్టాన్ని తీసుకురావాలి. భవిష్యత్తులో ఏ చిన్నారి ప్రాణం ఇలా బలైపోకూడదు,” అని ఆయన అన్నారు.

Ducati DesertX Rally: డుకాటి డెజర్ట్‌ఎక్స్ ర్యాలీ కొనుగోలుపై రూ. 1.5 లక్షల బెనిఫిట్స్..

ఈ సందర్భంగా సహస్ర తల్లి మాట్లాడుతూ.. “పోలీసుల దర్యాప్తుపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఏ ఆధారమూ లేకుండా కేసు జరిపి వదిలేయకుండా నిజమైన నిందితుడిని పట్టుకున్నారు. ఎంతో అల్లరి ముద్దుగా పెంచుకున్న నా కూతురు బలైపోయింది. తల్లిదండ్రులు పిల్లల మానసిక పరిస్థితిని గమనించాలి. నా కూతురు మరణమే చివరిది కావాలి. ఇకపై మరే చిన్నారి ఇలాంటి దారుణానికి బలవ్వకూడదు,” అని ఆమె వేదన వ్యక్తం చేశారు. సహస్ర పేరుతో చట్టం వస్తుందో రాదో తెలియదు కానీ న్యాయం తప్పకుండా జరగాలని కుటుంబం డిమాండ్ చేసింది. సమాజంలో ఇటువంటి అమానుష సంఘటనలు జరగకుండా కఠినమైన నిబంధనలు అవసరమని తల్లిదండ్రులు, బంధువులు అభిప్రాయపడ్డారు.

Ducati DesertX Rally: డుకాటి డెజర్ట్‌ఎక్స్ ర్యాలీ కొనుగోలుపై రూ. 1.5 లక్షల బెనిఫిట్స్..

Exit mobile version