Site icon NTV Telugu

KA Paul: సోనియా గాంధీ తెలంగాణ తల్లి కాదు, దేశ ద్రోహి

Ka Paul

Ka Paul

రాకేష్ టికాయత్ పై జరిగిన దాడిపై ఫైర్ అయ్యారు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్. ఆయనపై జరిగిన దాడిని ఖండిస్తున్నాని అన్నారు. నిన్న రెడ్డి ఘర్జణ సభలో జరిగిన గొడవల గురించి కూడా స్పందించారు.  రెడ్డి సామాజిక వర్గగొడవ, దాడులు ప్రజాస్వామ్యంలో తప్పు అని అన్నారు కేఏ పాల్.  పుచ్చలపల్లి సుందరయ్య గారు చివరన రెడ్డిని తీసేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో మాటల దాడులు కూడా మానేయాలని హితవు పలికారు. మతాలు, కులాలను వాడుకుని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. ఇండియాను నెంబర్ వన్ చేయాలనేదే నా తపన అని అన్నారు. గతంలో  అబ్దుల్ కలాం కూడా మెచ్చుకున్నారని అన్నారు

సోనియా గాంధీ తెలంగాణ తల్లి కాదు, దేశ ద్రోహి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహి పార్టీ అని.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని అన్నారు. 480 సీట్లు ఉన్న దేశంలో కాంగ్రెస్ పార్టీ 48 సీట్లకు పడిపోయిందని విమర్శించారు. రేపో మాపో అది 20,30కి  చేరుతుందని అన్నారు. మనకు పార్టీ ముఖ్యమా.. దేశం ముఖ్యమా..? అని ప్రశ్నించారు. ఇప్పుడున్నవన్నీ అవినీతి పార్టీలే అని దుయ్యబట్టారు.

Exit mobile version