NTV Telugu Site icon

KA Paul: వెంకటరెడ్డి ఎవరో నాకు తెలీదు.. 90 శాతం ప్రజలు నాకు సపోర్ట్‌గా ఉన్నారు

Ka Paul On Venkat Reddy

Ka Paul On Venkat Reddy

KA Paul Comments On Komatireddy Venkat Reddy: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచేశాయి. ఓవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలుస్తాయని తామే ముందే చెప్పామని బీజేపీ చెప్తుంటే.. మరోవైపు వెంకట్‌రెడ్డి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. తాము పొత్తులకు వెళ్లమని, ఒంటరిగానే పోటీ చేసి గెలుస్తామని రేవంత్ రెడ్డి వర్గం ఇప్పటికే స్పష్టం చేసింది. కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి సైతం ఎన్నికల ముందు గానీ, ఆ తర్వాత గానీ కేసీఆర్‌తో పొత్తు ఉండదని క్లారిటీ ఇచ్చారు. అసలు ఆ అవసరమే రాదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌కు నష్టం కలిగేలా వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని తాము పార్టీ అధిష్టానికి లేఖ రాస్తామని అన్నారు.

Renu Desai: గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పవన్ మాజీ భార్య

ఈ నేపథ్యంలోనే ప్రజాజాంతి పార్టీ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరో తనకు తెలియదని కుండబద్దలు కొట్టారు. వెంకటరెడ్డి కాంగ్రెస్ కోవర్టు అని చెప్పిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదన్న విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు. హుజురాబాద్‌లో మూడు లక్షల ఓట్లుంటే.. అందులో కాంగ్రెస్ పార్టీకి మూడు వేల ఓట్లు మాత్రమే పడ్డాయంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ పార్టీ సైతం తెలంగాణలో ఎక్కడా లేదన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తుడుచుకుపోయిందని, అందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న పార్టీలన్నీ రెండు మూడు కుటుంబాలకు, ఆయా కులాలకే మాత్రమే పరిమితం అయ్యాయన్నారు. తాను బీసీనని, ఓ దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పుకొచ్చారు. తనకు 90 శాతం ప్రజలు సపోర్ట్‌గా ఉన్నారన్న కేఏ పాల్.. తెలంగాణ నూతన సెక్రటేరియట్‌ను అంబేద్కర్ పుట్టినరోజునే ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు.

MLC: తెలంగాణలో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా.. అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

అంతకుముందు.. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను ప్రజలు ఓడిస్తారని కేఏ పాల్ జోస్యం చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు మాత్రమే అధికారం ఉంటుందన్నారు. ముగ్గురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారన్న ఆయన.. తమ పార్టీలో చేరేందుకు ఏప్రిల్ 30 వరకు ఆగాలని కోరానన్నారు. తమ పార్టీలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ప్రొఫెసర్లు, డాక్టర్లు కూడా చేరారని గుర్తు చేశారు. కోడ్ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా పడగా.. తన వల్లే ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. దేశాన్ని ప్రధాని మోడీ అప్పులకుప్పగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు లక్షా 56 వేల కోట్లు అప్పు చేస్తే.. మోడీ అందుకు రెట్టింపు అప్పు చేశారని మండిపడ్డారు. 8 ఏళ్లలో 118 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. అదానీ వెనుక మోడీ హస్తం ఉందని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విక్రయిస్తే ఆపేస్తానని కేఏ పాల్ పేర్కొన్నారు.