Site icon NTV Telugu

K Keshava Rao : మా మీద మీద కత్తి పెట్టి అగ్రిమెంట్ చేశారు

ధాన్యం కొనుగోళ్లపై టీఆర్‌ఎస్‌ నేతలు కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణపై కేంద్రం కక్షసాధింపుకు దిగిందని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేవరకు నిరసన కార్యక్రమాలు చేపట్టి ధాన్యం కొనుగోలు చేసేలా చేస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు, టీఆర్ఎస్ రాజ్య స‌భ ఎంపీ కేశవరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నామని, తెలంగాణలో వచ్చే రబి ధాన్యాన్ని కేంద్రం కొనాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మా మీద మీద కత్తి పెట్టి అగ్రిమెంట్ చేశారని, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులను కోరామన్నారు. రైతులకు సాయం చేయాల్సిన అవసరం ఉందని, ఈ బియ్యానికి మార్కెట్ ఉందన్నారు. కేంద్రానికి చెప్పాల్సిన విధంగా పార్లమెంట్ లో చెప్పామని, కేంద్ర ప్రభుత్వం పాసిస్ట్ పద్దతిలో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్రం రైతులకు సహకరించాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.

Exit mobile version