NTV Telugu Site icon

K. A. Paul: ప్రార్థించాం.. ఓడించాం.. కర్ణాటకను రక్షించాం

K.a.paul

K.a.paul

K. A. Paul sensational comments on Congress victory in Karnataka: కర్ణాటకలో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. గత నాలుగు నెలలుగా అనేక సార్లు స్వయంగా వెళ్లి పర్సనల్‌గా బీజేపీ మాజీ ఎంపీ సంగ్లియానాను కలిసామని అన్నారు. అంతేకాకుండా రెండు సంవత్సరాలుగా ప్రజాశాంతి పార్టీ కర్ణాటకలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిందని ఆయన చెప్పారు. అలాగే బీజేపీ పార్టీ మద్దతుతో జేడీఎస్‌ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుందని కేఏ పాల్‌ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ వేల కోట్లు ఖర్చుపెట్టారని విన్నామని అన్నారు. అక్కడ బీజేపీ పార్టీ, జేడీఎస్‌ పార్టీని ఓడించాలని ప్రార్థించామని.. అందుకోసం ప్రయత్నించాం.. చివరకు ఓడించి కర్ణాటకను రక్షించామని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పేర్కొన్నారు.

Read also: Lady Harrasment : కుర్రాళ్లు జాగ్రత్త.. ఎంజాయ్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న ఆంటీలు

ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ స్ట్రాంగ్‌గా లేదని మనకు తెలుసని తెలిపారు. గత సంవత్సరం 150 కార్పొరేట్‌ సీట్లలో కాంగ్రెస్‌ ఒకటి మాత్రమే గెలిచిందని గుర్తు చేశారు. ఇక హుజూరాబాద్‌లో 3లక్షల ఓట్లు పడితే వన్‌ పర్సెంట్‌ కూడా ఓట్లు కాంగ్రెస్‌ పార్టీకి రాలేదని తెలిపారు. కాబట్టి కాంగ్రెస్‌ నాయకులను మల్లురవి, భట్టి విక్రమార్క, హనుమంతరావులను తెలంగాణలో ఓట్లను చీల్చవద్దని పదే పదే అడిగామన్నారు. కానీ పదిలో ఐదుగురు, ఆరుగురు ప్రజాశాంతి పార్టీని కోరుకుంటున్నారని తెలిపారు. బీజేపీని, బీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించాలని చిత్తశుద్దితో కాంగ్రెస్ పని చేయాలన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిచేందుకు ప్రజాశాంతి పార్టీ ఏ విధంగా మద్దతు ఇచ్చిందో.. అలాగే తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ గెలిచేందుకు కాంగ్రెస్‌ మద్దతు తెలపాలని ఆయన కోరారు. తెలుగురాష్ర్టాలను రక్షించుకుందామని అన్నారు. బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో చిత్తుగా ఓడించి దేశాన్ని రక్షించుకుందామని కేఏ పాల్‌ కోరారు.
Ram Charan: బాబాయ్ సినిమా గ్లిమ్ప్స్ అబ్బాయికి బాగా నచ్చేసిందట…