Site icon NTV Telugu

Jupally Krishna Rao: సాంకేతికంగా బీఆర్‌ఎస్‌ గెలిస్తే.. నైతికంగా కాంగ్రెస్ గెలిచింది..

Juapalli Krsihna Rao

Juapalli Krsihna Rao

Jupally Krishna Rao: సాంకేతికంగా బిఅరెస్ గెలిచింది.. నైతికంగా కాంగ్రెస్ గెలిచిందని ఎక్సైజ్ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కి శుభాకాంక్షలు తెలిపారు. సాంకేతికంగా బీఆర్ఎస్ గెలిచిందన్నారు. నైతికంగా కాంగ్రెస్ గెలిచిందని తెలిపారు. 920 బీఆర్ఎస్, 350 కాంగ్రెస్, 100 బీజేపీకి ఓట్లు ఉన్నాయన్నారు. 763 ఓట్లు బీఆర్ఎస్ కి, 662 కాంగ్రెస్ వచ్చాయన్నారు. ప్రజల దృష్టి కాంగ్రెస్ వైపు ఉందిని, కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ కి ఓటు వేశారన్నారు.

Read also: Bomb Threat : పారిస్‌ నుంచి వస్తున్న విస్తారా విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

2018 ఎన్నికల తరువాత కేసీఆర్ ప్రతి పక్షం లేకుండా ఎమ్మెల్యే లను కొనుగోలు చేశారన్నారు. కేసీఆర్ లాగా మేము చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము అలా చేయాలి అంటే గెలిచే వాళ్ళం అన్నారు. కాంగ్రెస్ కి 300 ఓట్లు అధికంగా వచ్చేవి అన్నారు. మేము విజయం సాధించాం అని కేటీఆర్ అంటున్నారని తెలిపారు. ఇంకా 48 గంటల్లో పార్లమెంట్ ఫలితాలు. విజయం ఎవరి వైపు ఉంటుందో తెలుస్తుందన్నారు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెజారిటీ సీట్లు రానున్నవన్నారు. కేటీఆర్ ఇచ్చిన ప్రెస్ స్టేటెంట్ రాంగ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందన్నారు. ఏ ఎన్నిక అయిన కాంగ్రెస్ దే విజయం అన్నారు.
Venkatesh Iyer Marriage: ప్రేయసిని పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్‌.. ఫొటోస్ వైరల్!

Exit mobile version